సముద్రంలో ఈత కొట్టడం అంటే ఈజీ కాదు. కొన్నిసార్లు మన ప్రాణాలకే ముప్పు కలుగుతుంది. అయితే తాజాగా ఓ బీచ్ లో ఈత కొడుతున్న 23 ఏళ్ల కుర్రాడికి ఊహించని ఘటన ఎదురయింది. రష్యా కు చెందిన 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపొవ్ తన ఫ్యామిలీతో కలిసి ఈజిఫ్ట్ సందర్శనకు వెళ్లాడు. ఎర్ర సముద్రం తీరంలోని ఓ రిసార్ట్ లో బస చేశాడు. ఆ తర్వాత ప్రియురాలితో కలిసి బీచ్ లో ఈత కొడుతున్నాడు. ఈ టైంలోనే టైగర్ షార్క్ అక్కడ కనిపించింది. దీంతో అక్కడే ఉన్న యువకుడి పై దాడి చేసింది. అతడు గట్టిగా కాపాడండి కాపాడండి అంటూ కేకలు పెట్టాడు.
ఈదుకుంటూ వడ్డుకు వచ్చే ప్రయత్నం చేశాడు కానీ సొర చేప అతడిని చంపేందుకు పలుమార్లు ప్రయత్నం చేసింది. చివరికి అతడిని మింగేసింది. కళ్ళముందు సొర చేప తన కొడుకుని తినడంతో అతడి తండ్రి, కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. అలాగే అక్కడ ఉన్న పర్యాటకులంతా ఆ దృశ్యాన్ని చూసి వణికిపోయారు. రిసార్ట్ సిబ్బంది ఆ యువకుడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో బీచ్ సిబ్బంది బీచ్ వద్దకు వెళ్లవద్దని, నీటిలోకి దిగవద్దని హెచ్చరించారు.
బీచ్ beach లో సరదాగా గడిపేందుకు వచ్చామని, ఆ సమయంలో తన కొడుకు పై సొర చేప అటాక్ చేసిందని యువకుడి తండ్రి తెలిపారు. కేవలం 20 సెకండ్లలోనే ఆ సొర చేప తన కొడుకుని చంపి తినేసిందని చెప్పాడు. ఆ సొరచేప తన కొడుకుని నోట కరుచుకొని నీళ్లల్లోకి తీసుకువెళ్లిందని కంటతడి పెట్టాడు. అయితే యువకున్ని తినేసిన షార్క్ ను ఈజిప్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ పట్టుకుంది. అయితే అప్పటికే అతడిని సొర చేప పూర్తిగా తినేసింది అని వెల్లడించింది. బీచ్ లో దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నిషేధిత బీచ్లలో ఈతకు దిగవద్దని పర్యటకులను కోరింది. సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వచ్చిన మా కుర్రాడు చివరికి తిరిగి దాని లోకాలకు వెళ్లిపోయాడు.