Rasmi Gowtham : యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం రష్మీ వరుసగా కొత్త షోలను చేసుకుంటూ దూసుకెళ్లిపోతుంది. తాజాగా ఆమెకి జబర్దస్త్ కి యాంకర్ గా చేసే అవకాశం వచ్చింది. ఈ క్రమంలో రష్మీ ఒక నోట్ ని పంచుకుంది. ఇందులో అసలు సీక్రెట్ ను బయట పెట్టేసింది. ‘ ఈ సందర్భంగా నిర్వాహకులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. రష్మీ జబర్దస్త్ తిరిగి స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు. నేను ఈ ప్రత్యేకమైన షో చేసేందుకు ఎప్పుడు రెడీ గానే ఉంటాను. ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటాను. కొత్త ప్రత్యామ్నాయం వచ్చేంతవరకు హోస్టుగా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. అప్పటి వరకు నన్ను భరించండి ప్లీజ్ ‘అంటూ ఆ నోట్ లో పేర్కొంది.
జబర్దస్త్ కి అనసూయ ప్లేస్ లో యాంకర్ రష్మీ రావడంతో అంతా ఖుషి అయ్యారు. ఇక రెండు జబర్దస్త్ షోలో రష్మీ రచ్చ చేయడం ఖాయం అంటూ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకర్ గా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వారానికి మూడు రోజులు రష్మి బుల్లితెరపై సందడి చేయబోతుంది. తాజాగా జబర్దస్త్ కి తాత్కాలికంగానే యాంకర్ గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. దీంతో అసలు విషయం తెలిసి ఆమె అభిమానులు కాస్త నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. అయితే దీనికి పర్మినెంట్ యాంకర్ గా ఎవరు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
Rasmi Gowtham : జబర్దస్త్ కి యాంకర్ గా రావడంపై రష్మీ నోట్.

ప్రస్తుతం ఈవెంట్లకి హోస్ట్ గా యాంకర్ మంజుష మంచి ఫామ్ లో ఉంది. అయితే ఈమధ్య మంజుష జబర్దస్త్ కి యాంకరింగ్ చేయబోతుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె జబర్దస్త్ లోకి వచ్చే అవకాశం ఉందా అని సందేహిస్తున్నారు. జబర్దస్త్ కి యాంకర్ గా రష్మీ చేసిన విషయం తెలిసిందే. రెండు విడిపోయాక ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా చేస్తు వచ్చింది. అలాగే హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ నేటిజన్లను ఆకట్టుకుంటుంది. దీని ద్వారా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో సుడిగాలి సుదీర్ తో స్టేజ్ పై చేసే రొమాన్స్, ఇద్దరు డ్యూయెట్లు పాడుకుంటూ షో ని హైలెట్ చేస్తూ టిఆర్ పి పెంచారు. ఇప్పుడు సుడిగాలి సుదీర్ జబర్దస్త్ ను వదిలేశాడు. శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా వదిలేశాడు. దీంతో ఆయన స్థానంలో రష్మీ యాంకర్ గా చేస్తుంది.