Kajal Agarwal : టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు కాజల్ అగర్వాల్. ‘ లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాస్ హిట్ కావడంతో వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేసింది. సినిమాల్లో మంచి పొజిషన్లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితు గౌతమ్ కిచులును వివాహం చేసుకుంది. ఈ మధ్యనే ఒక బాబుకు జన్మనిచ్చింది. ఈ కారణం చేతనే సినిమాలకు దూరంగా ఉండవలసి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు మళ్లీ సినిమాలోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోయిన్ల కొరత కూడా ఉంది. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ కు మంచి అవకాశాలే రానున్నాయి.
ఇప్పటికే కాజల్ అగర్వాల్ కమల్ హాసన్ ‘ ఇండియన్ 2 ‘ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా షూటింగ్ సగం జరిగి ఆగిపోయింది. అయితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందంట. సెప్టెంబర్ 13 నుంచి కాజల్ అగర్వాల్ ‘ ఇండియన్ 2 ‘ సినిమాల షూటింగ్ లో పాల్గొన్నపోతున్నట్లు సమాచారం.వాస్తవానికి చిరంజీవి ‘ ఆచార్య ‘ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్, గా నటించాల్సింది.
Kajal Agarwal : ఆ సినిమాతోనే రీఎంట్రీ ఇవ్వబోతున్న కాజల్…క్లారిటీ ఇచ్చేసిందిగా…

కానీ కాజల్ ప్రెగ్నెన్సీ కావడంతో ఈ సినిమాలో తన క్యారెక్టర్ న తొలగించారు దర్శక నిర్మాతలు. ‘ ఇండియన్ 2 ‘ సినిమాలో కూడా కాజల్ రీప్లేస్ చేస్తారేమో అని అందరూ అనుకున్నారు.కానీ ఆమె పాత్రను తానే చేస్తున్నట్లు ఇంస్టాగ్రామ్ లో క్లారిటీ ఈచ్చేసింది కాజల్. ఇక ఈ సినిమా హిట్ అయితే కాజల్ అగర్వాల్ కు మంచి అవకాశాలు రావచ్చని అభిమానులు అనుకుంటున్నారు.