Aarti Agarwal : ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా…?

Aarti Agarwal : టాలీవుడ్ లో ఎందరో హీరోయిన్లు తమ నటనతో, అందంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అందులో ఒకరే ఆర్తి అగర్వాల్. సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. తర్వాత కొన్ని కారణాల వలన ఇండస్ట్రీకి దూరమైపోయారు.. అలాగే జీవితంలో కొన్ని ఒడిదుడుకుల వలన లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇకపోతే తన కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి, మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. 2001లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘ నువ్వు నాకు నచ్చావ్ ‘ సినిమాతో ఆర్తి అగర్వాల్ బాగా పాపులర్ అయింది.

ఈ సినిమా టాలీవుడ్ లో మొదటి సినిమా కావడంతో మంచి విజయాన్ని అందుకున్న ఆర్తి అగర్వాల్, తరువాత నాలుగు సంవత్సరాల పాటు ఫుల్ బిజీగా వరుస సినిమాలతో గడిపింది. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని, కెరీర్ లో మంచి పొజిషన్ లో ఉండగానే హీరో తరుణ్ తో ఆర్తి ప్రేమలో ఉందంటూ అప్పట్లో వార్తలు బాగా వైరల్ అయ్యాయి.ఆర్తి అగర్వాల్, తరుణ్ కాంబినేషన్లో ‘ నువ్వు లేక నేను లేను’ ‘ సోగ్గాడు ‘ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో వచ్చాయి. ఇక ఈ క్రమంలోని వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అని, ఆర్తి అగర్వాల్, తరుణ్ ని ప్రేమించిందని వార్తలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.

Aarti Agarwal : ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా…?

Reason of heroin Aarti Agarwal suicide
Reason of heroin Aarti Agarwal suicide

ఆ కారణం వలన ఆర్తి అగర్వాల్ కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.తరుణ్ వల్లే ఆర్తి అగర్వాల్ కెరియర్లో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొందని మీడియాలో వార్తలు రావడంతో ఆమె విషం తాగి సూసైడ్ చేసుకుందని, దాంతో తరుణ్ తో ఆర్తి అగర్వాల్ పెళ్లికి అతడి కుటుంబ సభ్యులు నిరాకరించారని ఆ కారణం వల్ల ఆమె విషం తాగిందని వార్తలు వచ్చాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో తరుణ్ పై వచ్చిన ఆరోపణలకు అతడి తల్లి రోజా రమణీ స్పందించడం జరిగింది.ఆ ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడుతూ ఆర్తి అగర్వాల్ గురించి కొన్ని వ్యాఖ్యలను చేశారు.

ఆర్తి అగర్వాల్ చాలా మంచి అమ్మాయి. ఆమెను ఒక సినిమా ఫంక్షన్ లో కలిసి మాట్లాడాను. తరుణ్ నాకు మంచి ఫ్రెండ్ అని, మా ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమ లేదని ఆ అమ్మాయి చెప్పింది. వాళ్లు పెళ్లి చేసుకుంటే ఎవరు మాత్రం అడ్డు వస్తారని కూడా తెలిపింది. ఇంటి నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న ఎవరు ఆపుతారు అంటూ ప్రశ్నించింది రోజా రమణి. ఇక ఆర్తి అగర్వాల్ విషం తాగడానికి కారణం తరుణ్ కాదని కూడా ఆమె చెప్పింది. ఇక ఆఖరికి ఆర్తి అగర్వాల్ ఎన్నారై ను వివాహం చేసుకున్నప్పటికీ ఆ బంధం నిల్వలేకపోయింది. ఏ కారణం వలనో ఆమె చివరికి తుది శ్వాస విడిచింది అని తరుణ్ తల్లి రోజా రమణీ చెప్పుకొచ్చారు.