Saipallavi : సాయి పల్లవి ఇప్పుడు వరుస సినిమాలతో అన్ని భాషల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ గా తన స్థానాన్ని ప్రజల పరుచుకుంది. చాలా కొంతమంది హీరోయిన్స్ మాత్రమే ఇలా చాలా కాలం వరకు స్టార్ డమ్ కొనసాగిస్తారు. సౌందర్య, స్నేహ, నిత్యామీనన్ తర్వాత అంతటి పేరును సంపాదించుకుంది సాయి పల్లవి. మెగాస్టార్ చిరంజీవి సైతం తనతో కలిసి డాన్స్ చేయాలని ఉంది అని చెప్పడమే తన క్రేజ్ కి ఉన్న ఒక ఉదాహరణ. సాయి పల్లవి చేసే సినిమాల్లో ప్రతి కథలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి.
ఈ మధ్య తాను నటిచినటువంటి విరాటపర్వం ఆ పాత్రలో తాను నటించిన తీరు ఆమని ఒక మెట్టు పైకి తీసుకెళ్ళింది అని చెప్పొచ్చు. సాయి పల్లవి నటించిన గార్గి కి మూవీ ప్రేక్షకులను ఈ నెల 15న అలరించడానికి సిద్ధమయ్యింది. ఈ సినిమా ఇప్పుడు తెలుగు తమిళం కన్నడ భాషల్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేయడం జరిగింది. సామాన్యమైన మధ్య తరగతి యువతీ యొక్క తండ్రిని పోలీస్ కేసు నుంచి విడిపించడానికి చేసిన సాహసమే ఈ సినిమా స్టోరీ. ఈ విషయం గార్గి మూవీ ట్రైలర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చి ఆకట్టుకుంది సాయి పల్లవి.
Saipallavi : సాయి పల్లవికి కూడా ఇంట్లో పెళ్లి గోల మొదలైందా …

ఆడపిల్లల పట్ల వివక్షతను గురించిన అంశాన్ని ఈ సినిమాలో ప్రస్తావించారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రతి ఇంట్లో న్యాచురల్ గానే అబ్బాయిలకు ఉన్నంత స్వేచ్ఛ అమ్మాయిలకు ఉండదు. మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంటారు అని చెప్పుకొచ్చింది. వాళ్లు అలా అడిగినప్పుడల్లా అదే నేను అబ్బాయిని అయితే నాకు అప్పుడే పెళ్లి చేసి పంపియాలని చూస్తారా అని మా వాళ్ళని అడుగుతానని చెబుతూ. ఇలాంటి సన్నివేశాలు సినిమాలో చాలా కనిపిస్తాయి అని సమాధానం ఇచ్చింది ఇచ్చింది. ఈ సమాధానాన్ని బట్టి తనను ఇంట్లో పెళ్లి పెళ్లి చేసుకోమని అడుగుతున్నట్లు చెప్పకనే చెప్పిందా అని అందరూ చర్చించుకుంటున్నారు. దీనిని బట్టి సాయి పల్లవి కూడా తన ఇంట్లో పెళ్లి గోల మొదలైందని అర్థమవుతుంది.