Samantha : రెండో పెళ్లి చేసుకోబోతున్న సమంత… ఇది నిజమేనా…

Samantha : సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది. ఎప్పుడు ఏదో ఒక జంటకు ఎవరో ఒకరితో ముడి పెడుతూ ఉంటారు. ఎంత సులువుగా ముడి పెడతారో, అంత ఈజీగా విడగొడతారు. వాళ్లు అసలు పెళ్లి చేసుకుంటారా చేసుకోరా అన్నది పక్కన పెడితే మీడియాలో అయితే చాలాసార్లు చాలామందితో పెళ్లిళ్లు అయిపోతుంటాయి. ఇప్పుడు తాజాగా సమంత పెళ్ళిపై ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే సమంత పెళ్ళికి సద్గురు కారణం అని అతని ద్వారానే సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందని పుకార్లు వస్తున్నాయి.

Advertisement

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత డెప్రెషన్ లోకి వెళ్లిందని, ఈ గురువుగారే దగ్గరుండి బాగు చేశారని, ఆయన ద్వారానే సమంత రెండో పెళ్లికి ఒప్పుకుందని, పెళ్ళికొడుకుని కూడా సద్గురు చూశారంటూ పుకార్లు వస్తున్నాయి. అయితే ఇవన్నీ నిజం కాదని సమంత పెళ్ళికి సద్గురుకి అసలు సంబంధమే లేదా అని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అసలు సమంతకి రెండో పెళ్లి ఆలోచన లేదని ప్రస్తుతం అనారోగ్య కారణంతో ఉండటం, వాటి నుంచి కోలుకున్న తర్వాత సినిమాలపై ఫోకస్ పెడుతుందట.

Advertisement

Samantha : రెండో పెళ్లి చేసుకోబోతున్న సమంత… ఇది నిజమేనా…

Samantha getting second marriage rumours
Samantha getting second marriage rumours

సమంత టాలీవుడ్, బాలీవుడ్ ఆ తర్వాత హాలీవుడ్ రేంజ్ లో ప్లానింగ్ చేస్తుందని ఆమెకు టచ్ లో ఉన్నా మీడియా మిత్రులు చెబుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ రెండో పెళ్లి వార్త అబద్దమే అని చెబుతున్నారు. ఇక సమంత నటించిన ‘ శాకుంతలం ‘ సినిమా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని కూడా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో సమంత శకుంతలగా, దుష్యంత మహారాజుగా దేవి మోహన్ నటించారు. అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి కీలకపాత్రలో నటించారు

Advertisement