Samantha : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. తెలుగు పరిశ్రమలో స్టార్ హీరోయిన్ అయిన సమంత, హీరో అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘ ఏం మాయ చేసావే ‘ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ప్రేమ పెళ్లిదాకా వెళ్ళింది. ఇరువురు తన ఫ్యామిలీని ఒప్పించి కళ్ళు చెదిరిపోయేలా గోవాలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. బోలెడన్ని ఆశలతో కొత్త కోరిక లతో ఒకటైన ఈ జంట పట్టుమని పది కాలాలు కూడా కాపురం చేయకుండానే విడిపోయారు. సమంత నాగచైతన్య పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాలు కలిసి ఉండి అభిమానులు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నారు.
ఇలా చేసినందుకు జనాలు వీరిద్దరిపై విరుచుకుపడ్డారు. అయితే వీళ్ళు విడాకులు ప్రకటించి దాదాపు సంవత్సరం అవుతుంది. అయినా ఇప్పటికీ సోషల్ మీడియాలో నాగచైతన్య, సమంత విడాకులకు సంబంధించిన ఏదో ఒక వార్త ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే రీసెంట్ గా గౌతం మీనన్ చేసిన వ్యాఖ్యలు వీరిద్దరి కలిసిపోయేలా ఉన్నాయని అంటున్నారు. గౌతం మీనన్ డైరెక్షన్ లో సామ్, చైతు కలిసి చేసిన సినిమా ఏం మాయ చేసావే. ఈ సినిమా వీళ్ళ ప్రేమకు పునాది. ఈ సినిమా కూడా మంచి హిట్ అయి వాళ్ళ కెరీర్ ని మలుపు తిప్పింది.
Samantha : సమంత నాగచైతన్య కలవబోతున్నారా… కారణం ఏమై ఉంటుంది…
అయితే ఏ మాయ చేసావే సినిమాకు సీక్వెల్ తీస్తారని ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇప్పుడు సమంత చైతు పేర్లు ట్రెండింగ్ లోకి వచ్చాయి. గౌతమ్ ఇప్పటికే సమంతతో మాట్లాడారని చైతుతో సినిమా చేయడానికి రెడీగా ఉందని టాక్ వస్తుంది. గతంలో నాగచైతన్య కి ఇదే ప్రశ్న ఎదురైతే భవిష్యత్తులో సమంతతో కలిసి నటిస్తారా అంటే.. ఆ టైం ప్రకారం నిర్ణయం తీసుకుంటానని, నో అయితే చెప్పనని చైతు చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే కచ్చితంగా తెరపైకి మళ్లీ నాగచైతన్య, సమంతల జంట ట్రెండ్ సెట్ చేస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ ఒకటి పోయిన ఆశ్చర్య పోనవసరం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.