Health Benefits : బోడ కాకరకాయ చూడటానికి ఆకుపచ్చని వర్ణాన్ని కలిగి ఉండి తమ చర్మంపై ముల్లుల లాంటివి ఏర్పరచుకొని ఉంటాయి. వీటికి చేదు స్వభావం చాలా తక్కువగా ఉంటుంది. ఇవి వర్షాకాలంలో పుష్కలంగా లభిస్తాయి. వీటిని కొన్ని ప్రాంతాలలో ఆకాకరకాయలు అని అంటారు.
గ్రామీణ ప్రాంతాలలో పొలాల చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి. పల్లెల్లో తక్కువ ధరకే లభించే ఇవి నగర పట్టణాలలో అధిక ధర పలుకుతాయి. అయినప్పటికీ వీటి పైన ఆసక్తి ఉన్నవారు ఏమాత్రం సంకోచించకుండా వీటిని కొనేసి, ఇంటికి తెచ్చేసి కోరో, పులుసో చేసుకొని భోజనంలో లాగిస్తుంటారు.
బుడగాకరకాయలో క్యాలరీలు తక్కువగా, పీచు పదార్థం యాంటీ ఆక్సిడెంట్లు పోషకాలు అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్లు, జలుబు ,దగ్గు ,జ్వరం వంటి సమస్యలనుండి బయటపడేందుకు వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఆ కాకరకాయ డయాబెటిస్ ని నియంతరించి, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీరంలో డెత్ స్కిన్సులను తొలగించి, న్యూ స్కిల్స్ ని ఏర్పరుస్తుంది. ఈ ఆకుపచ్చని కాకరకాయలు నీటి శాతం అధికంగానే ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ కాకరకాయ చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది.
Health Benefits : డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి బోడ కాకరకాయ దివ్య ఔషధం.
ఇందులో ఉండే లుటీన్ కెరుటినాయిడ్లు గుండె సంబంధిత వ్యాధులు, కంటి వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. 200 గ్రాముల బోడ కాకరకాయలో 14క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. వీటిలో అధికంగా లభించే ప్లేవానాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను పూర్తిగా తగ్గిస్తాయి. మలబద్ధక సమస్యతో బాధపడుతున్న వారు బోడ కాకరకాయ తినడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అధికంగా కురుస్తున్న వర్షాలు కారణంగా అడవి ప్రాంతాలలో బోడ కరకాయలు ఎక్కువగా లభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో వారు వీటిని స్వీకరించి మార్కెట్లలో అమ్ముతున్నారు. వీటి ధర అధికంగా ఉండడం పాటు ఔషధ గుణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి