Samantha : సమంత నాగచైతన్య తో విడాకుల తర్వాత రోజుకో టాపిక్ తో సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది… అయితే కొన్నాళ్లుగా ఈ అమ్మడు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తుంది. ఈ మధ్యకాలంలో అయితే సమంతా కు ఏదో స్కిన్ డిసీజ్ ఉందని పది రోజులు పాటు ఆయుర్వేద వైద్యం చేయించుకుందని, తరువాత ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వెళ్లిందని… ఈ కారణం చేతనే తను సోషల్ మీడియాకి దూరంగా ఉంటుందని కొందరు అంటున్నారు. అంతేకాకుండా కోయంబత్తూర్ లో ఆశ్రమంలో పూజలు చేస్తున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
Samantha : సమంతకు చిన్మయికి ఎక్కడ గ్యాప్ వచ్చింది…
ప్రస్తుతం నటి సమంత చేస్తున్న శకుంతల మరియు యశోద సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులు ముందుకు వస్తాయో తెలియని పరిస్థితి వచ్చింది. ఇక సమంత కెరియర్ ఈ రేంజ్ లో ఉండడానికి కారణం ఆమె నటనతో పాటు ఆమె హస్కీ వాయిస్ చెప్పినా చిన్మయి గొంతు కూడా అని చెప్పొచ్చు. సమంత సినిమా కెరియర్ లో చిన్మయి వాయిస్ చాలా హైలెట్గా నిలిచిందని చెప్పొచ్చు. ఈరోజు సమంత ఇంత స్టార్ అవడంతో సింగర్ చిన్నవి పాత్ర ఆమె వయసు కూడా సమంతకు చాలా హెల్ప్ చేశాయని మనందరికీ తెలిసిన విషయమే.
సమంతా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా చిన్మయి స్వరం తోడవడంతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులు సమంతను బాగా ఇష్టపడ్డారు. సమంతా కి ఈరోజు ఇంత ఫాలోయింగ్ ఉందంటే కారణం ఆమె చెప్పిన డైలాగులు కూడా ఒకటిగా చెప్పొచ్చు. అయితే మహానటి సినిమా దగ్గరనుంచి సేమ్ సినిమాని పక్కకు పెడుతూ వస్తుంది. ఇంతలా వీరిద్దరి మధ్య విభేదాలకు కారణం తెలియ రాలేదు.
చిన్మయి సమంతకి డబ్బింగ్ చెప్పడం మానేసిన తర్వాత సమంత చేసిన ప్రాజెక్టులకు అంత క్రేజ్ రాలేదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు యశోద మేకర్స్ చిన్మయి చేత డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారట. అయితే దీనికి సమంత అసలు అంగీకరించడం లేదని దీనికి కారణం ఏంటి అనేది వారిద్దరి మధ్య ఎందుకు అంత గ్యాప్ వచ్చిందని ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. సినిమాని వదులుకోవడం సమంతా కెరియర్ కు చాలా రిస్క్ అయినప్పటికీ ఎందుకిలా చేస్తుందనేది ఓ ప్రశ్నలా మిగిలింది.