Samantha : సమంత ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ అయిపోయింది. ఇప్పటివరకు సమంతా తెలుగులో టాప్ హీరోయిన్ జాబితాలో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంది. అదేవిధంగా టాలీవుడ్ హాలీవుడ్ లో కూడా బాగా నటించి మరియు తన అందాల ఆరబోతతో మంచి ఆఫర్లు తెచ్చుకుంది. సమంత వచ్చిన తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది. ఈ భామ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది.
సమంతాను మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన పాత్ర ఏమిటి అని అడగగా. తను చేసిన సినిమాలలో తనకు చాలా పాత్రల నచ్చాయని కానీ రెగ్యులర్ కు భిన్నంగా తను చేసిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ మరియు పుష్ప సినిమాలో ఉ అంటావా మామ ఉ ఊ అంటావా మామ అనే స్పెషల్ సాంగ్ తనకు బాగా నచ్చాయని చెప్పింది. రొటీన్ కి భిన్నంగా ఉండే ఇలాంటి పాత్రలు చేయడం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. సమంత ఇంకా ఈ సినిమాల గురించి చెబుతూ ఇలాంటి భిన్నమైన పాత్రలు చేయడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం అంటూ, ఈ పాత్రను తను ఛాలెంజ్ గా తీసుకొని చేసినట్లు చెప్పింది.
Samantha : నేను చేసిన సినిమాలలో నాకు నచ్చిన పాత్ర అదే అంటున్న సమంతా.
అంతేకాకుండా ది ఫ్యామిలీ మెన్2 వెబ్ సిరీస్ లో ఆ క్యారెక్టర్ జీవితం ఎన్నో ఒడిదుడుకుల తో నడిస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ను తను ఫీల్ అవుతూ ఆ పెయిన్ అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అయి చేశాను అని సమంత చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ పాత్ర కు సంబంధించి ఒక ఐటెం సాంగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఐటెం సాంగ్ ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాను అని పత్రికా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. రెగ్యులర్గా ఉండే పాత్రలు చేయడం తనకు నచ్చదని ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలు చేయడమే తనకు ఇష్టమని చెప్తూ తనకు ఈ ఫ్యామిలీ మాన్2 వెబ్ సిరీస్ అవకాశం రాగానే తను ఒప్పుకున్నట్లు చెప్పడం జరిగింది.