Samantha : గత వారం రిలీజ్ అయిన యశోద సినిమా గురించి తెలుసు కదా. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సమంత పర్ఫార్మెన్స్ బాగుందని అందరూ కితాబిచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ చెప్పుకొచ్చారు. కాకపోతే సినిమాకు కొన్ని రోజుల తర్వాత డివైడ్ టాక్ వచ్చింది. ఏది ఏమైనా సినిమా వసూళ్లు మాత్రం పర్వాలేదనిపించింది. దీంతో వెంటనే సినిమా యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈసందర్భంగా మాట్లాడిన సినిమా నిర్మాత కృష్ణ.. యశోద సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
యశోద సినిమా సీక్వెల్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. యశోద 2 మాత్రమే కాదు.. యశోద 3 కూడా తీసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి సమంత ట్రీట్ మెంట్ తీసుకుంటోంది కాబట్టి.. ఆమె ఆరోగ్యంగా తిరిగి వచ్చాక సీక్వెల్ కు సంబంధించిన విషయాలను ఆమెతో డిస్కస్ చేస్తామని, ఆమె ఓకే అంటే వెంటనే సీక్వెల్ షూటింగ్ ప్రారంభిస్తామని కృష్ణ తెలిపారు.
Samantha : సమంత ఆరోగ్యం కుదుటపడి యశోద సీక్వెల్ లో నటిస్తుందా?
అయితే.. సమంత ఆరోగ్యం ఇప్పట్లో కుదుటపడి యశోద సినిమా సీక్వెల్ లో నటిస్తుందా? అనే అనుమానాలు మాత్రం ఉన్నాయి. ఎందుకంటే.. తనతో సీక్వెల్ చేయాలంటే తను ముందు పూర్తి ఆరోగ్యంతో రావాలి. వచ్చినా.. తనకు చాలా కమిట్ మెంట్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తి చేసి.. ఆ తర్వాత యశోద సీక్వెల్ చేయాలంటే చాలా ఏళ్లు పడుతుంది. మరి.. అప్పటి వరకు సినిమా యూనిట్ వెయిట్ చేస్తుందా? లేదా.. సమంత ప్లేస్ లో వేరే హీరోయిన్ ను పెట్టి యశోద సీక్వెల్ ను తీసుకొస్తుందా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.