Aamir Khan : అమీర్ ఖాన్ ను సినిమాలో చూస్తే ఎలాగుంటాడో తెలుసు కదా. అబ్బా.. ఏమున్నాడురా అని అనుకుంటాం కదా. కానీ.. రీల్ లైఫ్ లో కాదు.. రియల్ లైఫ్ లో అమీర్ ఖాన్ ఎలా ఉంటాడో తెలుసుకుంటే మాత్రం అబ్బా అని నోరెళ్లబెడతారు. అవును.. ఎందుకంటే.. అసలు అమీర్ ఖాన్ వయసు ఎంతో చాలామందికి తెలియదు. ఆయన ఇప్పటికీ కుర్ర హీరోయిన్లతో ఆడిపాడుతున్నాడు. అయితే.. అమీర్ ఖాన్ వయసు 57 ఏళ్లు. అంతే కాదు.. ఆయనకు ఒక కూతురు కూడా ఉంది. తన పేరు ఇరా ఖాన్. మరి.. ఆ వయసులో అంటే ఎలా ఉంటారో తెలుసు కదా. కానీ.. వెండి తెర మీద ఆ చాయలేవీ కనిపించకుండా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు అమీర్ ఖాన్.
తాజాగా తన కూతురు ఇరా ఖాన్ నిశ్చితార్థ వేదికలో అమీర్ ఖాన్ ను చూసి చాలా మంది షాక్ అయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఎందుకంటే.. పూర్తిగా ఎక్కడ చూసినా అమీర్ ఖాన్ కు మొత్తం తెల్ల వెంట్రుకలే. తన కూతురు ఇరా ఖాన్.. జిమ్ కోచ్ నుపుర్ శిఖరేను ప్రేమించింది. ఇద్దరూ కలిసి సహజీవనం కూడా చేశారంటూ వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో అమీర్ ఖాన్ కూడా తన కూతురు ఇష్టాన్ని కాదనలేక అతడితోనే ఇచ్చి పెళ్లి ఫిక్స్ చేశాడు. తాజాగా తన కూతురు ఇరా ఖాన్ నిశ్చితార్థం ముంబైలో జరిగింది.
Aamir Khan : తన కూతురు నిశ్చితార్థం వేడుకలో దిగిన ఫోటో వైరల్
అయితే. తన కూతురు ఇరా ఖాన్ నిశ్చితార్థ వేడుకలో దిగిన అమీర్ ఖాన్ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో అమీర్ ఖాన్ తెల్ల గడ్డంతో దర్శనమిచ్చాడు. అంటే… ఇన్ని రోజులు మేకప్ తో కవర్ చేశాడన్నమాట. కానీ.. వేడుకలో అడ్డంగా దొరికిపోయాడు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా కూతురే ఇరా ఖాన్. తను కూడా ఫిలిం ఇండస్ట్రీలోనే ఉంది.