Chandra Mohan : టాలీవుడ్ సీరియల్ నటుడు, హీరో చంద్రమోహన్ ఈరోజు తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో 9 : 45 నిమిషాలకు హృద్రోగ సమస్యతో కన్నుమూశారు. ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాదులో జరగనున్నాయి. చంద్రమోహన్ సినీ జీవితంలో చేయని పాత్ర లేదు. హీరోగా, కమెడియన్ గా, ఫాదర్ గా, బ్రదరుగా, అంకుల్ గా చాలా పాత్రలను చేసి మెప్పించారు. 1966లో ‘ రంగులరాట్నం ‘ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన చంద్రమోహన్ మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.
బి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చంద్రమోహన్ కు నటుడిగా మంచి పేరును తీసుకొచ్చింది. అప్పట్లో ఆయన సరసన హీరోయిన్గా చేసిన వారికి లక్కు తిరిగినట్టే. ఆయనతో నటించిన శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి లాంటి ఎంతోమంది హీరోయిన్లు స్టార్లుగా రాణించారు తెలుగు సినిమాలో తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. హీరోగా, విలన్ గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలిలో రాణించారు.
1945 మే 23న చంద్రమోహన్ కృష్ణాజిల్లాలో జన్మించారు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో డిగ్రీ చేశారు. ప్రఖ్యాత దర్శకుడు కె . విశ్వనాథ్ కి చంద్రమోహన్ కజిన్ అవుతారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ సిరిసిరిమువ్వ ‘ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ‘ కొత్తనీరు ‘ వంటి సినిమాలతో సీరియస్ హీరోగా నటించిన చంద్రమోహన్ తర్వాత ‘ బంగారు పిచ్చుక ‘ సినిమాల నుంచి తనలోని కామెడీని బయటికి తీసుకొచ్చారు. ‘ గంగ-మంగ ‘ వంటి కొన్ని సినిమాల్లో విలనిజం చూపించారు. వచ్చినా పాత్రకు తగిన న్యాయం చేయడంలో పక్కాగా ఫాలో అయ్యేవారు.