CM-KCR : కేసీఆర్ కు ఆ రెండు సినిమాలు అంటే చాలా ఇష్టం .. మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటారట ..

CM-KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయ నేతగా మంచి గుర్తింపు పొందారు. తెలంగాణ రావటం కోసం కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఆయనే ఎంపిక అయ్యారు. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో రాజకీయ నాయకుడిగా మంచి పేరు పొందారు. ఇక రాజకీయ నాయకులకు కూడా మైండ్ రిలీఫ్ అవ్వాలంటే ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే కదా. ఇక కేసీఆర్ కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు.

Advertisement

kcr-likes-those-two-movies-very-much

Advertisement

కేసీఆర్ సీనియర్ ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్. ఎన్టీఆర్ నటించిన ‘ దానవీరశూరకర్ణ ‘ సినిమాను పదేపదే చూస్తుంటారు. ఆ సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టం. సభల్లో ప్రసంగించే సమయంలో కూడా ఈ సినిమాలోని డైలాగులను ప్రస్తావిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని తన కొడుకుకు పేరు పెట్టి నిరూపించుకున్నారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ కు ‘ ఆరాధన ‘ సినిమా అంటే చాలా ఇష్టం. ఈ సినిమాను కూడా ఆయన పదే పదే చూస్తూ ఉంటారట. ఇక కేసీఆర్ మాంసాహార ప్రియుడు. ఆయనకు నాటుకోడి కూర అంటే చాలా ఇష్టమట. పలు సందర్భాలలో ఆ వంటకాన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారట.

kcr-likes-those-two-movies-very-much

రాజకీయాలలో అంత బిజీగా ఉన్నా తనకు ఇష్టమైన ఆహారం తినడంలో ఎక్కడా రాజీపడరు. ఇక మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ కొట్టాలని కేసీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరపున పలు సమావేశాలలో పాల్గొంటూ భారత రాష్ట్ర సమితి అధికారంలోకి తీసుకురావాలని నొక్కి చెబుతున్నారు. తెలంగాణ రాకముందు కేసీఆర్ మొదటగా కాంగ్రెస్ లో ఉండి తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి ఉద్యమంలోకి వెళ్లారు. ప్రస్తుతం ఆ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా గెలవాలని కేసీఆర్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement