గుజరాత్ కు శుభ్ మన్ గిల్ బై బై.. ఆ జట్టులో ప్రమోషన్..!

టీమిండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఈ ఏడాది ఐపీఎల్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. వరుసగా రెండేళ్ళుగా భీకర ఫామ్ లో కొనసాగుతున్న ఈ యువ సంచలనం తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న గుజరాత్ టైటాన్స్ జట్టు నుంచి వైదొలిగే అవకాశం కనిపిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నుంచి శుభ్ మన్ కు ఆహ్వానం అందినట్లు సమాచారం. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఐపీఎల్ లో శుభ్ మన్ గిల్ ను హైదరాబాద్ టీమ్ లో చూడవచ్చు.

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ గడిచిన రెండు సీజన్లలో అద్భుత విజయాలను సాధించింది. ఇందులో శుభ్ మన్ గిల్ పాత్ర అమోఘం. ఎన్నో అపురూపమైన ఇన్నింగ్స్ లను ఆడి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన గిల్.. ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసి అరేంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. అటువంటి గిల్ ను గుజరాత్ వదులుకునే అవకాశం లేదు కానీ హైదరాబాద్ నుంచి ఆహ్వానం అందటంతో అతను సన్ రైజర్స్ టీమ్ కు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని శుభ్ మన్ ను జట్టులోకి తీసుకోవాలని సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ టీమ్ కు నాయకత్వ సమస్య కూడా వేధిస్తోంది. ఈ ఏడాది మార్ క్రమ్ ను కెప్టెన్ చేసినా అతను ఆశించిన ప్రదర్శన చేయలేకపోయారు. కనుక గిల్ ను జట్టులో చేర్చుకుంటే బ్యాటింగ్ పరంగానే కాకుండా అతనికి జట్టు పగ్గాలు అప్పగించాలని జట్టు మేనేజ్ మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ జట్టుతోపాటు పంజాబ్ కింగ్స్ కూడా కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తామంటూ ఆఫర్ ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, గిల్ మాత్రం హైదరాబాద్ జట్టులో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు తెలిసింది.