జబర్దస్త్ కామెడి షో ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. టాలెంట్ ఉన్నప్పటికీ సినిమాలో అవకాశాలు రాక ఇబ్బందులు పడిన ఎంతోమంది ఆర్టిస్టులకు బ్రతుకుతోవ చూపింది జబర్దస్త్. అందుకే ఎన్నో ఆఫర్లు వచ్చిన కొంతమంది ఆర్టిస్టులు మాత్రం జబర్దస్త్ ను వీడటం లేదు. జబర్దస్త్ ద్వారానే తమకు ఈ క్రేజ్ వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నారు.
అలాంటి వారిలో నరేష్ ఒకరు. మరి ఆయన జబర్దస్త్ లో ఒక్కో షోకు ఎంత తీసుకుంటున్నారని అందరికీ ఓ సందేహం ఉంది. చూడటానికి పొట్టిగా కనిపించినా మనోడి టాలెంట్ కు అందరూ ఫిదా కావాల్సిందే. నరేష్ కు యంగ్ కుర్రాడికి ఉన్న వయసు ఉంటుంది. జబర్దస్త్ లో నరేష్ మొదట్లో సపోర్టింగ్ రోల్ చేసేవాడు తరువాత టీం కెప్టెన్ గా మారేంత స్టేజ్ కు చేరుకున్నాడు.
నరేశ్ 2000 జూలై 17న జన్మించారు. వీరి కుటుంబం తన చిన్నప్పుడే పట్టణానికి వచ్చి స్థిరపడింది. పుట్టుక సమయంలో అతను జానేడు మాత్రమే ఉన్నాడట. మొదట అతను బ్రతకడం కూడా కష్టమని వైద్యులు చెప్పారట. కానీ వైద్య పరీక్షలు అనంతరం నరేష్ ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పడంతో అతని తల్లి సంతోషించిందట. జన్యులోపం వలన నరేష్ హైట్ పెరగలేదు.
నరేష్ చిన్న వయస్సులో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడట. ఆ సమయంలోనే నరేష్ సుధాకర్ టీంలో చేరాడు. ఒక రకంగా సుధాకర్ టీంకు గుర్తింపు రావడానికి నరేష్ ఓ కారణమని చెప్పొచ్చు. అయితే జబర్దస్త్ లోకి వచ్చాక నరేష్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఒక్కో షోకు 3 నుంచి 4 లక్షల రూపాయయలవరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.
Also Read : అందరూ మనవరాళ్లే – చిరంజీవికి మనవడిని ఎత్తుకునే భాగ్యం లేదా..?