Karthikeya 2 : హీరో నిఖిల్ నటిస్తున్న సినిమా ‘ కార్తికేయ 2 ‘.ఈ సినిమా మొదటి భాగమైన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా వస్తుంది. సరికొత్త కాన్సెప్ట్ తోనే కార్తికేయ 2 మూవీ ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సినిమా ఈవెంట్ కు హాజరైన డీజే టిల్లు స్టేజిపై మాట్లాడుతూ నవ్వులు పూయించాడు.
‘ కార్తికేయ 2 ‘ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గురువారం సాయంత్రం నిర్వహించారు.ఈ ఈవెంట్ కు హాజరైన డిజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ స్టేజ్ పై మాట్లాడుతూ నవ్వులు పూయించాడు. కార్తికేయ సినిమా టీజర్ వండర్ ఫుల్ గా అనిపించింది. ఇక ట్రైలర్ మరో లెవెల్ లో ఉంది. ట్రైలర్ రిలీజ్ అయిందని ఎవరో చెబితే సెల్ఫోన్లో చూడటం ఇష్టం లేక ఇంటికి వెళ్లి స్క్రీన్ లో చూశాను. ట్రైలర్ చాలా బాగా అనిపించింది సినిమాలో అవుట్ స్టాండింగ్ స్టఫ్ ఉంది. సూపర్ లాజికల్, మైథలాజికల్ ఇలాంటి జోనర్లు తీసేసుకున్నాడు అని అన్నాడు. దీనికి హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందిస్తూ.. బ్రో మీకు కావాలంటే హ్యాపీగా తీసేసుకోండి అని అన్నాడు.
Karthikeya 2 : సుమ పై డీజే టిల్లు డైలాగ్స్

అయితే నేను బండి వేరే వైపు తిప్పిన కొంచెం సేపు అటు ఉంటా అంటూ సిద్దు నవ్వులు పూయించాడు. నాకు ఆగస్టు 13న సినిమా ఎవరు చూపిస్తున్నారు నిఖిల్ నా, అనుపమ నా ఇద్దరిలో ఎవరు టిక్కెట్లు ఇప్పిస్తారు. సుమ గారు అందరికీ పెద్ద దిక్కు మీరే కాబట్టి మీరే చెప్పాలి అని సిద్దు అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. అన్ని సినిమాలు తానే తీసుకున్నానని సుమా చెప్పగా, రాధిక.. నీ జయమ్మ పంచాయితీ ఇక్కడ పెట్టకు.. నీది వేరే లెక్క.. నువ్వు పెద్ద రాధికవి అని సరదాగా మాట్లాడాడు డీజే టిల్లు. ఏది ఏమైనా సిద్ధూ జొన్నలగడ్డ డిజె టిల్లు సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అతని మాట తీరుతో అందరినీ ఎంతగానో ఆకర్షించుకున్నాడు