VarunTej Lavanya : వరుణ్ తేజ్ బాటలోనే సిద్దు జొన్నలగడ్డ…ఆ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం…

VarunTej Lavanya  : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు బ్యాచిలర్ బంధాన్ని విడిచి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వరుణ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అయితే వరుణ్ తేజ్ వివాహం నవంబర్ ఒకటవ తేదీన ఇటలీలో ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ దంపతులిద్దరూ హైదరాబాద్ ను విడిచి ఇటలీకి చేరుకున్నారు. ఇక అతి త్వరలోనే వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారు. అయితే తాజాగా వరుణ్ తేజ్ బాట లోనే మరో హీరో వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

siddu-jonnalagadda-going-to-marry-heroine

Advertisement

డిజె టిల్లు సినిమా ద్వారా ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా హాట్ టాపిక్ గా మారింది. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల నటించినప్పటికీ సిద్దుకి డీజే టిల్లు సినిమా ద్వారానే మంచి సక్సెస్ లభించింది. ఈ క్రమంలోనే సిద్దు జొన్నలగడ్డ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న సిద్దు సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ తోనే ప్రేమలో ఉన్నారట.

siddu-jonnalagadda-going-to-marry-heroine

అయితే మొదట హీరోయిన్ సిద్దుకు ప్రపోజ్ చేయడంతో అతను కూడా ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేశారని కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాక వీరి పెళ్లి విషయం పై ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సిద్దు ప్రేమిస్తున్న ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఇలా వస్తున్న వార్తలలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ విషయం పై సిద్దు స్పందిస్తేనే క్లారిటీ వస్తుందని చెప్పాలి.

Advertisement