Viral Video : తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8.3 కోట్లు విలువ చేసే కరెన్సీ ఆకాశం నుండి పడుతుంటే అందరూ ఆశ్చర్యపోయి చూశారు. మరుక్షణమే తెరుకుని వీలైనంత నోట్ల కట్టాలను వారి బ్యాగ్ లో వేసుకునేందుకు ఎగబడ్డారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పూర్తి వివరాలకు వెళ్తే…
చెక్ రిపబ్లిక్ లోని లిసానాడ్ లాబేమ్ ప్రాంతంలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. కమిళ్ బర్తో షేక్ అనే వ్యక్తి స్థానికంగా చాలా పాపులారిటీ ఉన్న వ్యక్తి. ఇక ఇతను సోషల్ మీడియా ఇన్ఫ్లుయేన్సర్ అలాగే టీవీ వ్యాఖ్యాత కూడా. అయితే తాజాగా ఆయన నటించిన ఓ సినిమాలోని పజిల్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక ఆ చిక్కుముడి విప్పిన వారికి మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. కానీ ఆ చిక్కుముడిని ఎవరు చెప్పలేకపోయారు. అయినప్పటికీ కాస్మా మాత్రం తన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మిలియన్ డాలర్ల కరెన్సీని హెలికాప్టర్ సహాయంతో ఆకాశం నుండి కురిపించారు.
ఇక ఎవరికి తోచినంత వారు తీసుకుంటారనేది ఆయన ఉద్దేశం. అనుకున్నదే పనిగా ఒక హెలికాప్టర్ సహాయంతో కరెన్సీ నోట్లను కంటైనర్ లో పెట్టి ఆకాశంలోకి తీసుకెళ్లాడు. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత కంటైనర్ కింద భాగాన్ని తెరవడంతో ఒక్కసారిగా కరెన్సీ నోట్లు బయటికి వచ్చాయి. ఇలా ఆకాశమంత కరెన్సీ నోట్లతో నిండిపోయింది. దీంతో అక్కడున్న వారంతా వీలైనంత డబ్బును చేజిక్కించుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇక అక్కడి ప్రజలు నోట్లు ఏరుకుంటూ ఉండగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram