Simran : సిమ్రాన్ ను ఏడిపించిన స్టార్ డైరెక్టర్… దానికి ఒప్పుకో అంటూ ముఖంపై డబ్బులు విసిరేసాడట…

Simran : హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో హీరోయిన్ సిమ్రాన్ కు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఏ పాత్రనైనా ఈజీగా చేసేస్తుంది సిమ్రాన్. అందుకే సినిమాలో టాప్ హీరోయిన్ గా మంచి గుర్తింపును దక్కించుకుంది. సిమ్రాన్ అటు గ్లామరస్ రోల్స్, ఇటు అభినయానికి సంబంధించిన సినిమాలను చేస్తూ తనలోని నటనకి మంచి మార్కులు వేయించుకుంది. చిరంజీవి నటించిన ‘ డాడీ ‘ సినిమాలో ఒక పాపకి తల్లి పాత్రలో ఎంత బాగా నటించిందో. ఇప్పటికీ ఈ సినిమా వస్తే చాలామంది చూసే వాళ్ళు ఉంటారు. అంతలా ఆకట్టుకుంది సిమ్రాన్.

Advertisement

సిమ్రాన్ తెలుగు పరిశ్రమకి ‘ అబ్బాయిగారి పెళ్లి ‘ అనే సినిమాతో పరిచయం అయింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ క్రమంలోని ప్రియా ఓ ప్రియా, మా నాన్నకు పెళ్లి, ఆటో డ్రైవర్, కలిసుందాం రా, నరసింహనాయుడు యువరాజు, మృగరాజు, డాడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. మరి ముఖ్యంగా సీతయ్య సినిమాలో హరికృష్ణకు జోడిగా నటించి శభాష్ అనిపించుకుంది. అయితే సినీ ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో సిమ్రాన్ కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొందంట.

Advertisement

Simran : దానికి ఒప్పుకో అంటూ ముఖంపై డబ్బులు విసిరేసాడట…

Simran crying because of that director
Simran crying because of that director

‘ మా నాన్నకు పెళ్లి ‘ సినిమా తర్వాత ఆమెను స్టార్ డైరెక్టర్ హీరోయిన్ గా ఆమెను అడిగారట. కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక సిమ్రాన్ ఆ డైరెక్టర్ కి నో చెప్పిందంట. దీంతో ఆయన సిమ్రాన్ మొహం పై డబ్బులు విసిరేసి నీకు ఎంత కావాలో అంత ఇస్తా హీరోయిన్ గా నటించు అని అన్నాడంట. అప్పుడు సిమ్రాన్ ఏడ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే సిమ్రాన్ కూర్చొని తిన్న తరగని ఆస్తిని సంపాదించుకుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చాక తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకుంది. ఇప్పుడు తన ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తుంది.

Advertisement