Women Qualitys : మహిళలు నీ లక్ష్మీదేవి రూపంగా అంటూ ఉంటారు. భారతీయ సంస్కృతిలో మహిళలను దేవతలుగా చూస్తూ ఉంటారు. మహిళలు లేకపోతే సృష్టే లేదు. మహిళలు లేకుండా విశ్వం లేదు. మహిళల్ని సమాజ అభివృద్ధిలో ప్రధానమైన పాత్ర పోషిస్తారు. మహిళల గొప్పతనం గ్రంధాలలో రాశారు. అయితే ఈ నాలుగు లక్షణాలు ఉన్న మహిళలు ఆదర్శ మహిళలుగా పేర్కొనబడ్డారు. వీరిని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహిళలకు ఎటువంటి లక్షణాలు ఉండాలో చూద్దాం…
ధైర్యవంతులు ,విద్యావంతులు…
విద్య ఉన్న మహిళ తననే కాదు సమాజాన్ని మొత్తాన్ని మెరుగుపరుస్తుంది. అటువంటి స్త్రీలు కుటుంబానికి స్ఫూర్తి. చదువు ధైర్యాన్ని పెంచుతుంది. ధైర్యవంతురాలు కష్ట సమయంలో అధైర్య పడదు. ఆమె కష్టాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది. ఆదర్శ స్త్రీలకు ధైర్యం చదువు ఈ రెండు చాలా అవసరం.
Women Qualitys : వీళ్ళపై అమ్మవారు కటాక్షం తప్పక కలుగుతుంది..

ఆకర్షించే మాటలు…
మాటలు బంధాలని బలపరుస్తాయి. అలాగే అదే మాటలు బంధాలను విడగొడతాయి కూడా. ఏదైనా ఒక చిన్న మాటలోనే అంతా ఉంటుంది. శాస్త్రాల విధానం ప్రకారం మధురమైన మాటలు మాట్లాడే మహిళ కుటుంబానికి అదృష్టంగా అనుకుంటారు. స్మూత్ గా మాట్లాడే మహిళ ఎల్లప్పుడూ అందరూ కలిసిమెలిసి ఉండాలి అని అనుకుంటుంది. అలాంటి మహిళలు గౌరవానికి అర్హులు అత్తగారి, తల్లి గారి ప్రతిష్టను రక్షిస్తుంది.
ఆధ్యాత్మిక చింతన…
పవిత్రమైన మహిళ ఉన్న గృహంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ధర్మాన్ని అనుసరించే మహిళలకు మంచి చెడులు మధ్య తేడా తెలుస్తుంది. ఆమె కుటుంబానికే కాదు సమాజానికి కూడా సరైన దారిని చూపిస్తుంది. ఒక మతపరమైన మహిళ ఎటువంటి తప్పులు చేయకుండా కుటుంబాన్ని సరియైన రీతిలో నడిపిస్తుంది. కుటుంబంలో తప్పు చేస్తారు అని తెలిస్తే ఆ తప్పును సరిదిద్దడానికి ముందంజలో ఉంటుంది.
సంపద సంచితం…
సంపద పోగు చేసే లక్షణం ఉన్న మహిళలు తమ కుటుంబాన్ని ఎటువంటి పరిస్థితులను ఇబ్బందుల్లోకి నెట్టరు. ధనాన్ని ఏ విధంగా పొదుపు చేయాలో ఆ మహిళలకు తెలిసి ఉంటుంది. కుటుంబాన్ని ప్రతికూల పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకురావడానికి ఈ ధనం కీలక పాత్ర పోషిస్తుంది. మహిళల డబ్బును ఎలా ఖర్చు చేయాలో బాగా తెలుసు. అనవసరమైన ఖర్చు పెట్టరు. అటువంటి స్త్రీలు భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచి ఖర్చు చేస్తారు