Adavi Sesh : అడివి శేష్ 1985 డిసెంబర్ 17 న జన్మించాడు. అసలు పేరు శేష్ సున్నీ కేంద్ర అడివి. అడివి శేష్ నాన్నగారి వృత్తి డాక్టర్ కొద్దిరోజులు హైద్రాబాద్ లో కూడా ప్రాక్టీస్ చేశారు. శేష్ అమ్మగారిది నల్లగొండ. అతనికి చెల్లి కూడా ఉంది, తను కూడా ఒక డాక్టర్ శేష్ చిన్నతనంలో చాలా కష్టాలు పడ్డాడు. హైదరాబాద్ లో ఆర్దికంగా పరిస్థితులు బాగోలేక వాళ్ల ఫ్యామిలీ అమెరికాకి వెళ్లి అక్కడే స్థిరపడదాం అనుకున్నారు. కానీ అందుకు సరిపడా డబ్బులు కూడా లేక ఊర్లో ఉన్న కొద్ది పొలాల్ని అమ్ముకొని కాలిఫోర్నియాకి వెళ్లారు.
అప్పుడు అడివి శేష్ వయసు మూడు సంవత్సరాలు. శేష్ నాన్నగారికి డాక్టర్ గా అక్కడ సరైన అవకాశాలు దొరకలేదు అప్పుడు వాళ్ల నాన్న ఒక రెస్టారెంటులో మేనేజర్ గా పనిచేశారు, వాళ్ల అమ్మగారు కూడా అదే రెస్టారెంట్లో వెయిటర్ గా పని చేశారు. అలా వాళ్ల నాన్న కష్టాలను అనుభవిస్తూ కొద్ది రోజులకి మళ్లీ డాక్టర్ గా అవకాశం దొరికింది. కొద్దికొద్దిగా ఆర్థికంగా స్థిరపడ్డారు. అడివి శేష్ కి చిన్నప్పటినుండి సినిమాలపై ఆసక్తి ఉంది. అడివి శేష్ గారికి మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు అంటే చాలా ఇష్టం. శేష్ కి చిన్నప్పటి నుండి మన తెలుగుతనం, విశిష్టతల గురించి శేష్ నాన్నగారు నేర్పించారు.
Adavi sesh : అడివి శేష్ గురించి ఎవరికి తెలియని కొన్ని ఆసక్తి కరమైన విషయాలు.

అడివి శేష్ తో నాన్నగారు మూవీల్లో అవకాశాలు వస్తాయో లేదో తెలియదు వద్దు అని చెప్పినా వినకుండా అడివి శేష్ డైరక్టర్ కోర్స్ చేస్తానని పట్టుబట్టి అమ్మా నాన్నలను ఒప్పించాడు. ఫిల్మ్ కోర్స్ చేస్తున్నప్పుడే, శ్రీనువైట్ల సొంతం మూవీ అమెరికాలో షూట్ చేస్తున్నాడని తెలిసి శ్రీనువైట్ల గారిని కలిశాడు. అప్పుడు హీరోయిన్ కి కాబోయే భర్త పాత్రలో అడివి శేష్ కి అవకాశం దొరికింది. తర్వాత ఫిల్మ్ కోర్స్ పూర్తిచేసి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. అడివి శేష్ కర్మ మూవీతో హీరోగా తన ప్రయాణం మొదలుపెట్టాడు. కర్మ మూవీ ఫ్లాప్ అయ్యింది.
అడివి శేష్ తర్వాత పంజా, బలుపు, కిస్, రన్ రాజా రన్, లేడీస్ జెంటిల్మెన్, బాహుబలి, దొంగాట, సైజ్ జీరో, క్షణం, ఊపిరి, అమీతుమీ, గూఢచారి,ఎవ్వరూ మొత్తం పధ్నాలుగు సినిమాలు చేసారు. అడివి శేష్ చిన్న పాత్ర , పెద్ద పాత్ర అని ఆలోచించకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని తన నటనతో నిరూపించుకోవాలని చూశాడు. ఒక్కో మూవీలో ఒక్కో పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించుకున్నాడు. ప్రస్తుతం అడివి శేష్ “మేజర్” మూవీతో సూపర్ హిట్ కొట్టారు. మేజర్ మూవి అడివి శేష్ గారికి మంచి పేరు తెచ్చింది,ఎంతో మంది అభిమానులను ఈ సినిమాతో అడివి శేష్ సొంతం చేసుకున్నాడు. ఇలాగే ఇంకా ఎన్నో మంచి సినిమాలు అడివి శేష్ తీయాలి అని తన అభిమానులు అందరూ కోరుకుంటున్నారు