Sri Reddy : శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ తో ముందుకొచ్చింది. ఒకప్పుడు శ్రీ రెడ్డి పేరు చెప్తే వివాదాలే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు యూట్యూబ్లో వంటకాలు గుర్తొస్తున్నాయి. శ్రీ రెడ్డికి బోల్డ్ నెస్ తో పాటు ధైర్యం కూడా ఎక్కువే. ఏదో మాటలు చెప్పడం కాకుండా తరచూ చేతల్లో కూడా చూపిస్తుంటుంది. శ్రీ రెడ్డి చూపించడం అంటే శ్రీరెడ్డి తరహా ప్రదర్శన కాదు కానీ తనలోని డేరింగ్ ను చెన్నై వీధుల్లో కూడా ప్రదర్శిస్తూ హాట్ టాపిక్ గా మారింది. ఎంతోమంది ఇండస్ట్రీ, రాజకీయ ప్రముఖులకు నిద్ర పట్టకుండా చేసిన శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ దగ్గర అర్థనగ్న ప్రదర్శనతో బాగా పాపులర్ అయింది.
ఇండస్ట్రీలో చిన్న పెద్ద తేడా లేకుండా ఒక్కొక్కడికి చుక్కలు చూపించింది శ్రీరెడ్డి. అయితే పెద్ద వాళ్ళతో పెట్టుకోవడంతో శ్రీ రెడ్డికి సినిమాల్లో ఛాన్స్ లేకుండా చేశారు. బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చిన దాన్ని కూడా దూరం చేశారు. చెన్నైకి మకాం మార్చిన ఈ అమ్మడు సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూనే మరో ప్రక్క సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించుకునే మార్గాలను వెతుకుతుంది. శ్రీ రెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో వివిధ వంటకాలను శ్రీరెడ్డి స్టైల్ లో వండి వార్చుతూ వీడియోలను పెడుతుంది.ఒకవైపు వంటలు చేస్తూనే మరోవైపు మొక్కల గురించి జనాలకు తెలిసేలా చేస్తుంది. ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలని దానిపై శ్రీ రెడ్డి వీడియోలో వివరించింది.
Sri Reddy : వార్నింగ్ ఇచ్చిన శ్రీరెడ్డి.

సాధారణంగా మొక్కలు ఉదయం ఆక్సిజన్ పీల్చుకొని రాత్రికి కార్బన్డయాక్సైడ్ వదులుతాయి. కానీ ఇంట్లో పెంచుకోవాల్సిన మొక్కలు రాత్రికి కూడా ఆక్సిజన్ వదిలేసేలా ఉండాలి. అలాంటి మొక్కలు ఇవి అంటూ కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. వెరైటీ గెటప్ లో కనిపిస్తున్న శ్రీ రెడ్డిని చూస్తూ ఆమె చెప్పే ముచ్చట్లని ఆసక్తికరంగా వింటున్నారు. అలాగే తమిళ మీడియాలో పాపులర్ అయ్యేందుకు శ్రీ రెడ్డి అక్కడ యూట్యూబ్ ఛానల్స్ కి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. ఇంటర్వ్యూలకు తమిళ్లో కూడా మంచి గిరాకీ ఉండడంతో శ్రీ రెడ్డి ఇంటర్వ్యూల కోసం అక్కడ జనం ఎగబడుతున్నారు.