Sai Pallavi : స్టార్ హీరోయిన్ సాయి పల్లవి వరుస సినిమాలతో తన కెరీర్లో దూసుకెళుతుంది. వరుస సినిమా హిట్లతో తన ప్రతిభను కనబరుస్తుంది. తన నటనతో ఎంతోమంది యువకులను తన వైపుగా ఆకర్షించుకుంటుంది. సాయి పల్లవి నటించిన ‘ ఫిదా ‘ సినిమా లో పల్లెటూరి అమ్మాయిగా అభిమానుల మనసులో చోటుచేసుకుంది. ఈ మధ్యనే ఆమెకు లేడీ పవర్ స్టార్ అనే స్క్రీన్ నేమ్ కూడా ఇచ్చేశారు. సాయి పల్లవికి ఈ ట్యాగ్ తగిలించడం వలన చాలామంది హీరోయిన్ల మధ్య హార్ట్ టాపిక్ గా చర్చలు మొదలయ్యాయి.
సాయి పల్లవి లేటెస్ట్ గా ‘ గార్గి ‘ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో అమ్మడు చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. ఇంకా ఈ క్రమంలో తన పర్సనల్ ఇంట్రెస్ట్ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ఈ ముద్దుగుమ్మ. నచ్చిన కథ వస్తే నిర్మాతగా కూడా మారెందుకు తాను రెడీ అంటుంది. ఈమధ్య చాలామంది హీరోలు కూడా తమ సినిమాలను తామే నిర్మించుకుంటున్నారు. అంతేకాకుండా స్టార్ హీరోలు చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇదే లెక్కన ఈమధ్య హీరోయిన్స్ కూడా సొంత ప్రొడక్షన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇలా కొందరు హీరోయిన్స్ సొంత బ్యానర్ పెట్టి సినిమాలు చేస్తుండగా వారి సరసన తాము కూడా నిలుస్తామని అంటుంది ఈ అమ్మడు.
Sai Pallavi : దానికి రెడీ అంటున్న సాయి పల్లవి…

ఇదిలా ఉండగా తాను నిర్మాతగా మారేందుకు కొద్దిగా టైం ఉందని చెప్పుకొచ్చింది. తను నిర్మించాలనిపించే కథ వస్తే తప్పకుండా సినిమా ప్రొడ్యూస్ చేస్తానని అంటుంది సాయి పల్లవి. అంతేకాకుండా కేవలం ప్రయోగాలే కాదు కమర్షియల్ సినిమాలో కూడా నటిస్తానని అంటుంది సాయి పల్లవి. పాత్ర ప్రాధాన్యతను బట్టి తన సినిమా సెలక్షన్ ఉంటుందని, స్టార్ సినిమా అయినా సరే పాత్ర ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటే, అది చిన్న సినిమా అయినా సరే నేను చేస్తానని అంటుంది సాయి పల్లవి.