Sudigali Sudheer : జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వాళ్లలో ముందుగా చెప్పుకోవాల్సిన పేర్లు సుడిగాలి సుదీర్ ఇంకా చమ్మక్ చంద్ర. ఇటీవల జబర్దస్త్ ను విడిచి పక్క ఛానల్లో చేయడం మనం చూడొచ్చు. ముందుగా చమ్మక్ చంద్ర పెళ్లి అందరిని ఆశ్చర్యపరచగా. తర్వాత సుడిగాలి సుదీర్ కూడా వెళ్లడం జరిగింది. చమ్మక్ చంద్ర నాగబాబు తో కలిసి బొమ్మ అదిరింది ప్రోగ్రాంలో చేశాడు. అనుకున్నంత ఫాలోయింగ్ ప్రోగ్రాం కి రాకపోవడంతో కామెడీ స్టార్స్ లో సెటిల్ అయ్యాడు.సుడిగాలి సుదీర్ కూడా ఇదే బాటలో స్టార్ మా లో కి వచ్చాడు.
మల్లెమాల మరియు ఈటీవీలో ఏం జరిగిందో మనకు తెలియదు కానీ కేవలం రెమ్యూనరేషన్ విషయం గానీ బయటకు వచ్చినట్లుగా హైపర్ ఆది మరియు రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు. అయితే జబర్దస్త్ లో అవమానాల కారణంగానే వాళ్ళు బయటికి వచ్చినట్లుగా ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ల ఆధారంగా మనకు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా సుడిగాలి సుదీర్ ఇక ఎప్పటికీ ఈటీవీలో జరిగే మల్లెమాల ప్రోగ్రామ్స్ లో ఎప్పుడూ కనిపించడు అని అందరూ అనుకున్నారు.
Sudigali Sudheer : ప్రోమో మామూలుగా లేదుగా…
ఇప్పుడు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సుడిగాలి సుదీర్ ఇంకా చమ్మక్ చంద్ర ఈటీవీలో జరిగే 27వ వార్షికోత్సవంలో ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నట్టుగా ప్రోమోలో కనిపించింది. భలే మంచి రోజు అనే ఈవెంట్ కి యాంకర్ గా ప్రదీప్ వ్యవహరిస్తున్నాడు. ఈటీవీ మీదున్న మక్కువతోనే సుదీర్ మరియు చమ్మక్ చంద్ర లు వచ్చారేమో అని అందరూ అనుకుంటున్నారు. వీరి ఇరువురి ఎంట్రీ ఈవెంట్లో సందడి మామూలుగా ఉండదంటూ ప్రోమోలో చూపించడం జరిగింది. కాగా సుడిగాలి సుదీర్ అభిమానులు ఈ విషయం తెలిసి సంతోషంలో మునిగితేలుతున్నారు. అయితే సుడిగాలి సుదీర్ చేసేది మాత్రం ఈ ఒక్క ఈవెంట్ లో అని తెలుస్తుంది.