Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. తన శరీర అవయవాలు పనిచేయకుండా ఆగిపోవడం, శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ మరణించారు. ఉదయం 4 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఒక్కసారిగా సినీ లోకం దిగ్భ్రాంతికి గురయింది. కృష్ణ, మహేశ్ అభిమానులు దు:ఖ సాగరంలో మునిగిపోయారు.

ఇప్పటికే తన భార్య, తన పెద్ద కొడుకు మరణించడంతో చాలా కుంగిపోయిన కృష్ణ.. అలాగే మంచం పట్టారు. అనారోగ్యం మరింత ఎక్కువవడంతో తన భార్య ఇందిరా దేవి మరణించిన రెండు నెలలకే కృష్ణ కూడా మృతి చెందడంతో కృష్ణ అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే.. కృష్ణకు తన చివరి కోరికలు కొన్ని తీరకుండానే తీరని లోకానికి వెళ్లిపోయారని అంటున్నారు.
Super Star Krishna : ఆ నాలుగు కోరికలు ఏంటో తెలుసా?
సూపర్ స్టార్ కృష్ణకు ఛత్రపతి శివాజీగా నటించాలని చాలా కోరికగా ఉండేదట. ఇదివరకు ఓసారి శివాజీగా నటించేందుకు పలు ప్రయత్నాలు చేశారు కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఆ కోరిక తీరకుండానే కృష్ణ కన్నుమూశారు. అయితే.. అల్లూరి సీతారామరాజుగా కృష్ణ తెలుగు ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అలాగే.. తన మనవడు గౌతమ్ ను హీరోగా చూడాలని, గౌతమ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కృష్ణకు ఉండేదట. కానీ.. ఆ కోరిక కూడా తీరకుండానే కృష్ణ వెళ్లిపోయారు. అలాగే.. కౌన్ బనేగా కరోడ్ పతి లాంటి ఒక షోను హోస్ట్ చేయాలని కృష్ణకు ఉండేదట. అది కూడా తీరకుండానే చనిపోయారు. ఆ తర్వాత మహేశ్ బాబును జేమ్స్ బాండ్ లాంటి సినిమాలో నటిస్తే చూడాలని కృష్ణ అనుకున్నారట. ఆయన ఆఖరి కోరిక కూడా అదేనట. కానీ.. అది కూడా తీరలేదు. ఇలా.. ఈ ముఖ్యమైన నాలుగు కోరికలు తీరకుండానే కృష్ణ అనంత లోకాలకు వెళ్లిపోయారు.