RIP Krishna : చనిపోయే ముందు రోజు కూడా అదే తిన్నాడు.. ఇన్నేళ్లు బతికి ఉన్న సూపర్ స్టార్ కృష్ణ డైలీ డైట్ ఇదే..!

RIP Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ తెల్లవారుజామున కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆయన ఇక లేరనే విషయాన్ని కోట్లాది మంది అభిమానులు, ఆయన ఫ్యామిలీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అనారోగ్యంతో గత కొన్ని ఏళ్ల నుంచి బాధపడుతున్న కృష్ణ చివరకు అందరినీ వదిలేసి అనంత లోకాలకు వెళ్లిపోయారు. తనకు ఎంతో ఇష్టమైన తన కొడుకు మహేశ్ బాబు.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన్ను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సినీ ఇండస్ట్రీ పెద్దగా ఇన్నేళ్లు ఉన్న కృష్ణ ఒక్కసారిగా ఇండస్ట్రీని వదిలి తీరని లోకాలకు వెళ్లిపోవడంతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది.

do you know what is the food diet of super star krishna
do you know what is the food diet of super star krishna

ఈనేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ ఫుడ్ డైట్ కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే.. కృష్ణ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. ఆయన తీసుకునే ఫుడ్ వల్లనే కృష్ణ చాలా అందంగా కనిపించేవారని అంటుంటారు. ఎందుకంటే.. ఆయన రోజువారి మెనూలో ఖచ్చితంగా హెల్దీ ఫుడ్డే ఉంటుంది.

RIP Krishna : టీ కాఫీలు అస్సలు తాగని కృష్ణ

అసలు కృష్ణకు టీ, కాఫీలు అస్సలు పడేవి కావట. ఆయన ఉదయం ఇంట్లోనే ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తిని షూటింగ్ కు వెళ్లేవారట. ఆ తర్వాత మళ్లీ 11 గంటలకు పెరుగు వడను తినేవారట. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్, సాయంత్రం 5 గంటలకు గోధుమ రవ్వతో చేసిన దోశ.. ఇలా ఆయన డైలీ ఫుడ్ డైట్ ఇలాగే ఉంటుందట. ఆయన ఇప్పటికీ చనిపోయేవరకు కూడా అదే ఫుడ్ ను మెయిన్ టెన్ చేశారట. కృష్ణకు మధ్యాహ్నం లంచ్ చేయగానే ఒక 20 నిమిషాలు నడిచే అలవాటు ఉండేది. ఇలా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. మాయదారి జబ్బులు కృష్ణను అందరికీ దూరం చేశాయి. ఈ వయసులో ఆయన అవయవాలన్నీ పని చేయడం ఆగిపోవడంతో తన 80 ఏళ్ల వయసులో కృష్ణ తుదిశ్వాస విడిచారు.