Varalaxmi Sharath Kumar : సురేష్ కొండేటి చెత్త ప్రశ్నలు…గట్టి కౌంటర్ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్…

Varalaxmi Sharath Kumar  : సురేష్ కొండేటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.డిజె టిల్లు సినిమా ప్రమోషన్స్ సమయంలో హీరోయిన్ గురించి సురేష్ కొండేటి అడిగిన ప్రశ్నలు అప్పట్లో పెద్ద దుమారమే లేపాయి. హీరోయిన్ శరీరంపై ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో మీరు లెక్క పెట్టారా అని హీరో సిద్దును సురేష్ కొండేటి అడిగిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రశ్నకు సిద్దు ఎలాంటి సమాధానం చెప్పకపోయినా…ఒక సినిమా జర్నలిస్టు ఈ విధంగా ప్రశ్నలు అడగటం ఎవరికి నచ్చలేదు. దీంతో నేటి జనులు సురేష్ కొండేటి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో అతనిపై భారీ ఎత్తున ట్రోలింగ్ కూడా జరిగింది. అయినప్పటికీ సురేష్ కొండేటి మాత్రం అసలు మారలేదు.

Advertisement

suresh-kondetis-worst-questions-varalakshmi-sarath-kumar-gave-a-strong-counter

Advertisement

ఇప్పటికీ కూడా ప్రతి సినిమా ప్రమోషన్స్ లో , మీడియా సమావేశాలలో అలాంటి ప్రశ్నలే అడుగుతూ వస్తున్నాడు.  ఈ నేపద్యంలో చాలామంది సినీ ప్రముఖులు హీరోలు నిర్మాతలు సురేష్ కొండేటి పై ఆగ్రహం చూపించిన అతని బుద్ధి మాత్రం మార్చుకోలేదు. ఇటీవల హీరో సిద్ధార్థ కూడా సురేష్ కొండేటికి వార్నింగ్ ఇచ్చాడు. అయితే తాజాగా ఓంకార్ దర్శకత్వంలో మాన్షన్ 24 అనే సినిమా డిస్నీ ప్లస్ ఆర్ట్ స్టార్ లో విడుదలైంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ ను మూవీ టీం నిర్వహించింది. ఇక ఈ సినిమాకు వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించగా..ఆమె కూడా ప్రమోషన్స్ లో పా ల్గొన్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్ మీటింగ్ కు సురేష్ కొండేటి కూడా రావడం జరిగింది.

ఈ నేపథ్యంలోనే సురేష్ కొండేటి వరలక్ష్మి ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగసాగాడు. అయితే ముందుగా మీరు దయ్యాలు ఆత్మలు ఉంటాయని నిజంగా నమ్ముతున్నారా అని ఓ జర్నలిస్టు వరలక్ష్మి ని ప్రశ్నించగా అవును నమ్ముతానని ఆమె చెప్పుకోచ్చింది. ఇంతలో సురేష్ మైక్ తీసుకుని దెయ్యాలు ఉన్నాయని ఈ సినిమా చేశారా అంటూ అడుగుతాడు. దీనికి వరలక్ష్మి స్పందిస్తూ..దయ్యాలు ఉన్నాయా అని సినిమా తీయడమేంటి అలా అంటే ఎవరు ఏ సినిమా చేయరు అని సమాధానం ఇచ్చింది. ఇక ఆ తర్వాత మీరు దయ్యాలను ఇష్టపడతారా లేక దేవుని ఇష్టపడతార అని మరో పనికి మాలిన ప్రశ్న అడిగాడు సురేష్ కొండేటి. దీంతో కాస్త ఆగ్రహించిన వరలక్ష్మి ఇది ఒక ప్రశ్ననా జనరల్ గా ఎవరైనా దేనిని ఇష్టపడతారు అంటూ కౌంటర్ ఇచ్చింది.

Advertisement