Samantha Ruth Prabhu : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వరుస సినిమాలో నటిస్తూ అగ్ర కథానాయకగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. నటి గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి సమంత ఇటీవల ఓ భయంకరమైన వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాధి నుండి కోలుకోవడానికి సమంత కొద్దిరోజుల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇలా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండి తన ఆరోగ్యం పై పూర్తిగా దృష్టి పెట్టి ఇప్పుడు పూర్తిగా కోలుకొని సినిమాలోకి మరల వచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఆమె పెద్ద ఎత్తున వర్క్ ఔట్స్ చేస్తూ తన ఆరోగ్యం కాపాడుకునే పనుల్లో నిమగ్నమైంది.ఈ క్రమంలోనే షూటింగ్ లేని సమయాలలో సమంత ఎక్కువగా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ కనిపిస్తుంది. ఇక ఆమె చేసే వర్కౌట్స్ కి సంబంధించినటువంటి ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఒక గుర్తు తెలియని వ్యక్తి సమంతను చాలా విసిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక వస్తావా అంటూ మెసేజ్ చేసినట్లుగా దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ ను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే అసలు ఏం జరిగింది అనే విషయానికొస్తే సమంత జిమ్ ట్రైనర్ సమంతతో వర్కౌట్ చేయించేందుకు అర్ధరాత్రి సమయంలో ఆమెకు మెసేజ్ చేసి రేపు జిమ్ కి వస్తున్నావా అని అడిగారు. ఇక దీనికి సమంత లేదు నేను లీవ్ తీసుకుంటున్నానని బాడీపెయిన్స్ ఉన్నాయని చెప్పింది. అయితే ట్రైనర్ మాత్రం నేను ఇంకా ఇక్కడే ఉన్నాను వస్తావా అంటూ మెసేజ్ చేయగా సమంత రాను అని చెబుతున్నప్పటికీ బలవంతంగా తీసుకువెళ్లి వర్క్ ఔట్స్ చేపించినట్లుగా సమంత షేర్ చేసిన పోస్ట్ లో అర్థమవుతుంది.దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ మారింది.