తారకరత్న భార్య రెండో పెళ్లి- అలేఖ్య రెడ్డి క్లారిటీ

నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమె మరో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిందంటూ పుకార్లు షికార్లు చేస్తున్న వేళ ఆమె చేసిన పోస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Advertisement

నందమూరి తారకరత్న మరణించి ఏడాది కూడా కాలేదు. అప్పుడే అతని భార్య అలేఖ్య రెడ్డి మరో వ్యక్తితో పెళ్లికి ఒకే చెప్పిందని సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా విస్తృతస్థాయిలో ప్రచారం జరుగుతోంది. పిల్లల భవిష్యత్ దృష్ట్యా అలేఖ్య కుటుంబ సభ్యులు మరో పెళ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి పెంచడంతో అందుకు అలేఖ్య అంగీకరించిందని వార్తలు వచ్చాయి.

Advertisement

ఈ నేపథ్యంలో అలేఖ్య టార్గెట్ గా తీవ్ర విమర్శలు చెలరేగాయి. భర్త చనిపోయి పట్టుమని పది నెలలు కూడా పూర్తి కాలేదు అప్పుడే మరో పెళ్లికి రెడీ ఐపోయవా..?అంటూ కొంతమంది అసభ్యంగా పోస్టులు పెట్టారు. ఇలా పోస్టులు పెట్టడంపై తీవ్ర చర్చ సాగింది. మరోవైపు నిజంగానే అలేఖ్య రెడ్డి అలాంటి నిర్ణయం తీసుకున్నారా? అని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ విషయంపై అలేఖ్య రెడ్డి తాజాగా స్పందించారు.

మరో పెళ్లి చేసుకుంటున్నట్లు వస్తోన్న వార్తలను అలేఖ్య రెడ్డి ఖడించారు. ‘నా తుదిశ్వాస విడిచే వరకు నేను నీ భార్యనే.. నా జీవితానికి నువ్వు చాలు..’అని ఎమోషనల్ అవుతూ పోస్టు పెట్టారు. దీంతో ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చినట్లయింది.

Advertisement