Dirty Picture :బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ల లో ఒకరు విద్యాబాలన్. లేడీ ఓరియంటెడ్ సినిమాలు, బయోపిక్లతో విద్యాబాలన్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇంతకుముందు ఆమె నటించిన సిల్క్ స్మిత బయోపిక్ ‘ది డర్టీ పిక్చర్ ‘ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ఈ సినిమా ద్వారా ఆమె నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందాయి. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా విద్యాబాలను విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టింది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టింది.
అయితే తాజాగా ‘ది డర్టీ పిక్చర్’ సినిమా గురించి ఒక ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. సుమారు దశాబ్దం తర్వాత ‘డర్టీ పిక్చర్’మూవీ కి సీక్వెల్ రానున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నట్లు దర్శక నిర్మాతలు వెల్లడించినట్లు సమాచారం. అయితే ఈ సీక్వెల్ కోసం ఇంకా విద్యాబాలన్ ను సంప్రదించలేదంట. స్క్రిప్ట్ ఇంకా పూర్తికాని ఈ సీక్వెన్ను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అయితే ఈ సినిమాకు విద్యాబాలన్నీ తీసుకుంటారు లేక మరో ఏ హీరోయిన్ తీసుకుంటారో క్లారిటీ అయితే లేదు.
Dirty Picture : ది డర్టీ పిక్చర్ సినిమాకి రానున్న సీక్వెల్… ఈసారి హీరోయిన్ ఎవరంటే…

ఈ సినిమా సీక్వెల్ కు విద్యాబాలన్ హీరోయిన్ గా వస్తుందా లేక మరో హీరోయిన్ కి ఛాన్స్ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా మిల్లన్ లుత్రియ దర్శకత్వం వహించిన ‘ ది డర్టీ పిక్చర్ ‘ సినిమా 18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ వద్ద 117 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో విద్యాబాలన్ తో పాటు ఇమ్రాన్ హష్మీ, నసీరుద్దీన్ షా, తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాకు ఏక్తా కపూర్, శోభ కపూర్ నిర్మాతలుగాశవ్యవహరించారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు రానున్న సీక్వెల్ ఎలాంటి రికార్డు సృష్టిస్తుందో వేచి చూడాలి.