Tiger Nageswara Rao Review : తాజాగా మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఈరోజు అక్టోబర్ 20న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. అయితే రవితేజ ఇప్పటివరకు తీసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరొక ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఫ్రిక్షనల్ స్టోరీ కాదు ఒక వ్యక్తి నిజ జీవిత స్టోరీ. ఇది ఒక సువర్టుపురం కి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు కథ. అంటే ఇది ఒక గజ దొంగ బయోపిక్ అని చెప్పవచ్చు. ఆ గజదొంగ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ సినిమాలో ఆ దొంగ పాత్రలో మాస్ మహారాజ రవితేజ నటించడం జరిగింది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను 1970 వ దశకంలో సువర్టుపురంలో టైగర్ నాగేశ్వరరావు చేసినటువంటి సన్నివేశాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
అంతేకాక తొలిసారి రవితేజ పాన్ ఇండియా మూవీగా టైగర్ నాగేశ్వరరావు సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమాను దసరా కానుక అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేయడంతో సినిమాకు సంబంధించిన ముందుగానే రివ్యూ వచ్చేసింది. అంతేకాక విదేశాల్లో ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించడం జరిగింది. దీంతో ఈ సినిమా స్టోరీ గురించి సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించిగా వారిలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్, అనుక్రితివాస్ నటించారు. అంతేకాక పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది.
సినిమా విషయానికొస్తే….
నిజానికి బయట ప్రపంచానికి టైగర్ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఒక దొంగగా మాత్రమే తెలుసు. అయితే ఆయనలో ప్రపంచానికి తెలియని మరో కోణం ఉందని చూపించే విధంగా ఈ సినిమా రూపొందించారు. టైగర్ నాగేశ్వరరావు ఒక మంచి మనసున్న వ్యక్తి అనే కోణాన్ని ఆధారంగా చేసుకుని సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు టీజర్లు ట్రైలర్లు భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఇది నిజ జీవిత కథ కాబట్టి అప్పుడు టైగర్ నాగేశ్వరరావు ఎలాంటి దొంగతనాలు చేశాడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనే అంశాలను చూపించే విధంగా సినిమా సాగుతుంది. టైగర్ నాగేశ్వరరావు చాలా దారుణంగా హత్య చేయబడ్డాడు. మరి సినిమాలో కూడా రవితేజ క్యారెక్టర్ ని డైరెక్టర్ అలాగే చూపించాడా లేదా…క్లైమాక్స్ ఏమైనా మార్చడం జరిగిందా అనేది సినిమాలో చూడవచ్చు. ఇక టైగర్ నాగేశ్వరరావు పాత్రకు రవితేజ కరెక్ట్ గా సూట్ అయ్యారు. సువర్టుపురం అనే గ్రామాన్ని తలపించేలా డైరెక్టర్ గ్రాఫిక్స్ అదిరిపోయేలా తీశాడు. ఇక ప్రస్తుతం సినిమా రివ్యూ విషయానికొస్తే పాజిటివ్ టాక్ తో నడుస్తుంది. ఇక రవితేజ అభిమానులైతే సూపర్ డూపర్ హిట్ అంటూ ప్రీమియర్ షోల వద్ద తెగ హంగామా చేసేస్తున్నారు.