Trisha Krishnan : అందానికి అందం నటనకి నటనతో సుదీర్ఘకాలం నుండి సౌత్ సినీ ఇండస్ట్రీలో హవాని చూపిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది హాట్ బ్యూటీ త్రిష. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాక అన్ని భాషల్లో హీరోయిన్ గా రాణించింది. అదే సమయంలో వరుస ఆఫర్లతో సత్తా చాటింది. అయితే త్రిష టీనేజ్ లో మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. తండ్రి లేకపోయినా తన తల్లి సహకారంతో సిని రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ గ్లామర్ ఫీల్డ్ లో ప్రత్యేకమైన గుర్తింపు సాధించింది. అదే సమయంలో మిస్ మద్రాస్ గా కూడా త్రిష ఎంపికైంది.
అనంతరం మిస్ ఇండియా పోటీలలో మిస్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును అందుకొని ఫిలిమ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది.ఆ తర్వాత జోడి అని సినిమాలో చిన్న పాత్రలో త్రిష నటించడం జరిగింది. అనంతరం సూర్య హీరోగా నటించిన మౌనం అనే సినిమాలో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ” నీ మనసు నాకు తెలుసు” అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ తో వర్షం సినిమాలో నటించి బ్లాక్ బాస్టర్ అందుకుంది. ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది త్రిష . అలా అప్పటినుంచి ఇప్పటివరకు తన హావ కోనసాగుతూనే ఉంది. అయితే త్రిష కు ఇప్పటికీ పెళ్లి కాలేదు.
దీంతో సోషల్ మీడియా వేదికగా త్రిష పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా త్రిష పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలు సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హార్ట్ టాపిక్ గాారింది. 40 ఏళ్ల వయసు వచ్చిన సరే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఓ ప్రముఖ నిర్మాతతో త్వరలో ఏడడుగులు వేయబోతుందట. ఇక దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతుంది. ఇక ఇలా వస్తున్న వార్తల్లో నిజమేంటో తెలియాలంటే త్రిష స్పందించాల్సిందే.