Kolly Wood : కోలీవుడ్ హీరోయిన్ మహాలక్ష్మి మరియు నిర్మాత రవీందర్ గురించి వినే ఉంటారు. ప్రస్తుతం వీరిద్దరు పాపులర్ సెలబ్రిటీ జంటగా ఉన్నారు. ఇక వీరు పెళ్లి చేసుకున్నప్పటినుండి ఏదో రకంగా వార్తల్లో వస్తూనే ఉన్నారు. అంతేకాక వీరు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వారి లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే ఎంతో అందంగా ఉండే మహాలక్ష్మి నిర్మాత రవీందర్ ను పెళ్లి చేసుకోవడంతో డబ్బు కోసమే ఆమె అతనిని పెళ్లి చేసుకుందని విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఈ మధ్యకాలంలో వీరిద్దరూ విడిపోయారని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మహాలక్ష్మి భర్త రవీందర్ అరెస్టు అయ్యారు.
ఓ స్కామ్ లో రవీందర్ ను పోలీసులు అరెస్ట్ చేయడం కోలీవుడ్ లో కలకలం రేపింది. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ రవీందర్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిర్మాతగా ఉండే రవీందర్ ను సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసిందంటే ఆయన ఓ బిజినెస్ మాన్ ని మోసం చేశారట. ఓ వ్యాపారిని దారుణంగా మోసం చేసిన కారణంగా రవీందర్ అరెస్టు అయ్యారు. చెన్నైకి చెందిన బాలాజీ అనే ఓ వ్యాపారవేత్త తో కలిసి భాగస్వామిగా బిజినెస్ చేద్దామని చెప్పి అతని వద్ద 15 కోట్లు తీసుకుని మోసం చేసినట్లుగా అధికారులు నిర్ధారించారు. భర్త రవీందర్ అరెస్టుతో మహాలక్ష్మి దిగ్భ్రాంతికి లోనైందని అందరూ అనుకుంటున్నారు. అతని బెయిల్ కోసం అభ్యర్థించగా దానిని కోర్టు తిరస్కరించింది. దీంతో మహాలక్ష్మి మరింత ఆందోళనకు లోనే ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు.
తన భర్త రవీందర్ ప్రస్తుతం కస్టడీలోనే కొనసాగుతున్నారు . అయితే భర్త కస్టడీలో ఉండగా అండగా నిలబడాల్సిన మహాలక్ష్మి మాత్రం సోషల్ మీడియాలో డాన్స్ చేస్తూ రీల్స్ పోస్ట్ చేస్తుంది. దీంతో ప్రస్తుతం ఈమె పై ప్రతి ఒక్కరు ఫైర్ అవుతున్నారు. అంతేకాక డబ్బు కోసమే తన భర్తను పెళ్లి చేసుకుని ఇప్పుడు జైలుకు పంపించిందని నేటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. తన భర్త అరెస్ట్ అయి జైల్లో ఉంటే ఈమె కనీసం బెయిల్ కోసం కూడా ట్రై చేయకుండా తన ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ టైంపాస్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. మహాలక్ష్మి తీరు చూస్తుంటే కావాలనే భర్తను జైలుకు పంపి అతని ఆస్తిని కొట్టేయాలని చూస్తుందంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.