Yadamma Raju Second Marriage : పటాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెరపై సందడి చేసిన వారిలో యాదమ్మ రాజు ఒకరు. ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి యాదమ్మ రాజు ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం లో సందడి, చేస్తూ కనిపిస్తున్నారు. అంతేకాక ఇతర బుల్లితెర కార్యక్రమలలో మరియు వెండితెర పై కూడా అవకాశాల్ని అందుకుని కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. అయితే యాదమ్మ రాజు స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి మనకి తెలిసిందే. ఇకపోతే ఈ జంట సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులు సందడి చేస్తూ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తమకి సంబంధించిన అన్ని విషయాలు అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు చాలా దగ్గరగా ఉంటారు.
అయితే గత కొన్ని నెలల క్రితం వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టినటువంటి ఈ దంపతులు మరోసారి పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను వారి యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా , షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇదివరకే పెళ్లి చేసుకున్నటువంటి ఈ దంపతులు మరోసారి పెళ్లి చేసుకోవలసిన అవసరం ఏంటి అనే ఆలోచన ప్రతి ఒక్కరు మొదలైంది. ఇక అసలు విషయానికొస్తే పెద్దల సమక్షంలో సాంప్రదాయంగా వివాహం చేసుకున్నటువంటి వీరిద్దరూ తమ వివాహాన్ని చట్టబద్ధం చేయాలన్న ఉద్దేశంతో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవాలని భావించారట. ఈ క్రమంలోని రిజిస్టర్ కోసం కొన్ని నెలల క్రితం దరఖాస్తు చేసుకోగా ఇప్పటికి అధికారులు వారి మ్యారేజ్ ను రిజిస్టర్ చేశారు.
అయితే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళినటువంటి ఈ జంట అక్కడ మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరిది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కావడంతో , రిజిస్టర్ , అధికారులు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుందని వీరిని పట్టుచీర మరియు పంచ కట్టుకొని రావాలని అలాగే స్వీట్స్ కూడా తీసుకురావాలని రిజిస్టర్ అధికారులు తెలియజేశారు. అనంతరం రిజిస్ట్రేషన్ చేస్తామని తెలియజేశారట. దీంతో రిజిస్టర్ అధికారుల సమక్షంలో మరోసారి వీరిద్దరూ దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోను చిత్రీకరించి వారి యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. మ్యారేజ్ విషెస్ ఆఫీస్ వెళ్లి నీ జంట ఆఫీసర్ పెళ్లి చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేస్తారని అధికారులు చెప్పారట ఇలా అధికారులు సమక్షంలో మరోసారి దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నటువంటి తతంగం ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది