Balagam Actor Narsingam : బలగం నటుడు మృతి .. భారీగా ఆర్థిక సాయం అందించిన డైరెక్టర్ వేణు ..

Balagam Actor Narsingam  : రీసెంట్ గా వచ్చి సెన్సేషనల్ హిట్ అందుకున్న ‘ బలగం’ సినిమాలోని నటుడు నర్సింగం మృతి చెందాడు. ఈ సినిమాలో సర్పంచ్ క్యారెక్టర్ చేసిన నర్సింగం మృతి చెందారు. దీనిపై వేణు స్పందిస్తూ చివరి రోజుల్లో మీరు బలగం సినిమాలో మీలోని నటుడిని చూసుకోని కళాకారుడుగా తృప్తి చెందడం అదృష్టంగా భావిస్తున్నాను, ఓం శాంతి అని ట్వీట్ పెట్టారు. మొదటిగా బలగం సినిమా కథ కోసం నరసింగం బాపును కలిశాను. ఆరోజు నాకోసం కళ్ళు గూడాలు తెప్పించాడు అని వేణు పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు కొందరు సంతాపం తెలియజేస్తున్నారు.

Advertisement

balagam-actor-passed-away-director-venu-who-gave-huge-financial-aid

Advertisement

జబర్దస్త్ నటుడు వేణు డైరెక్షన్లో ప్రియదర్శి పులికొండ, కావ్యా కళ్యాణ్ రామ్ జోడిగా వచ్చిన సినిమా బలగం. పల్లెటూరి అనుబంధాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది. అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ నిర్మాతలకు లాభాల పంట పండించింది. ‘ మల్లేశం ‘ తర్వాత హీరోగా ప్రియదర్శికి ఈ సినిమాతో మరో సక్సెస్ వచ్చింది. ప్రియదర్శిలో మంచి కమెడియన్ కాకుండా మంచి నటుడు ఉన్నట్లు మల్లేశం సినిమాతో ఇదివరకే ప్రూఫ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో మధ్యతరగతి తెలంగాణ యువకుడి పాత్ర లో అద్భుతంగా రాణించాడు.

balagam-actor-passed-away-director-venu-who-gave-huge-financial-aid

ప్రియదర్శి తాతగా నటించిన సుధాకర్ రెడ్డి తన పాత్రలో జీవించాడు. కావ్య కళ్యాణ్ రామ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలోని మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా దర్శకుడు వేణు ఎల్దండి తెలంగాణ పల్లె నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. తెలంగాణతోపాటు పల్లెలతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు. దీంతో ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగా ఆదరించారు. నేటి యువత డబ్బు విషయంలో ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని హీరో పాత్ర ద్వారా చక్కగా తెరపై చూపించాడు దర్శకుడు. ఇదిలా ఉండగా డైరెక్టర్ వేణు నరసింగం కుటుంబానికి మూడు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించినట్లు సమాచారం.

Advertisement