Baby Movie : ఇటీవల తెలుగు సినీ ఇండస్ట్రీలో విడుదలైన బేబీ సినిమా ఎంతటి ప్రజాధరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకుని కలెక్షన్స్ మోత మోగించింది. మరి ముఖ్యంగా ఈ సినిమాకు నేటితరం యువకులు బాగా ఆకర్షితులయ్యారు. అలాగే ఈ సినిమాకు హీరోయిన్ గా నటించిన వైష్ణవి కూడా తన నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు సాధించింది. అయితే బేబీ సినిమా భారీ విజయం సాధించడంతో ఎంతో ఆనందంలో ఉన్న బేబీ చిత్ర బృందానికి ఇటీవల ఊహించని షాక్ తగిలింది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు నెలవైన బేబీ సినిమాపై ఇటీవల నగర పోలీస్ కమిషనర్ సివీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాలు నేటి తరాన్ని పక్కదారి పట్టించేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే సినిమాలో కొన్ని సన్నివేశాలు డ్రగ్స్ కల్చర్ ను ప్రోత్సహించేలా ఉన్నాయని సివీ ఆనంద్ మండిపడ్డారు. అంతేకాక కొన్ని అపార్ట్మెంట్స్ లో తాము రైడ్స్ నిర్వహించినప్పుడు …బేబీ సినిమాలోని కొన్ని సీన్స్ కనిపించాయని…ఆ సినిమాను చూసి నిందితులు అలా తయారయ్యారని ఆయన చెప్పుకొచ్చాడు. సినిమాలో అలాంటి సన్నివేశాలను పెట్టినప్పుడు కనీస హెచ్చరికగా ప్రకటన ఇవ్వాలి.
కానీ అవేమీ లేకుండా అలాంటి సన్నివేశాలను కూడా డైరెక్ట్ గా ప్లే చేశారని… సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన సీన్స్ ను చూపిస్తూ సివీ ఆనంద్ మండిపడ్డారు. మరల మేము హెచ్చరించిన తర్వాత అలాంటి సీన్లకు హెచ్చరికగా ప్రకటన వేశారని ఆయన చెప్పారు. దీనికి గాను బేబీ సినిమాకు మేము నోటీసులు జారీ చేశామని పోలీస్ కమిషనర్ ఆనంద్ తేలియజేశారు. ఇక నుంచి ప్రతి సినిమాపై పోలీస్ శాఖ నిఘా ఉంటుందని సినిమాలో అసభ్యకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.