Pawan Kalyan – Balakrishna :  చంద్రబాబు కోసం భారీ ర్యాలీతో రాజమండ్రికి వెళ్ళనున్న బాలకృష్ణ, పవన్ కళ్యాణ్…

Pawan Kalyan – Balakrishna : స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు అరెస్టుపై ఏపీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. జాతీయ నేతలు కూడా చంద్రబాబుకి మద్దతు తెలుపుతున్నారు. ఇక చంద్రబాబుని కలవడానికి ఆయన కుటుంబంతో పాటు పలువురు పార్టీ నాయకులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ , నారా బ్రాహ్మణి , నారా భువనేశ్వరి చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిశారు. అనంత భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ కూడా అయ్యారు.

pawan-kalyan-balakrishna-nara-lokesh-to-meet-chandrababu-in-jail

ఇక నేడు చంద్రబాబుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలవనున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు బాలకృష్ణ కూడా చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలులో కలవనున్నారు. దీంతో వీరి భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. నేడు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ బాలకృష్ణ భేటీ అవ్వన్నున్నారు. వీరితోపాటు నారా లోకేష్ కూడా వెళ్లనున్నట్లుసమాచారం.మంగళగిరిలో ఉన్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్ రాజమండ్రి కి గన్నవరం నుంచి విమానంలో వెళ్తారు.

pawan-kalyan-balakrishna-nara-lokesh-to-meet-chandrababu-in-jail

హైదరాబాద్ లో ఉన్న బాలకృష్ణ కూడా ప్రత్యేకంగా విమానం లో రాజమండ్రి వెళ్లి అక్కడ టిడిపి నాయకులను కలిసి అనంతరం చంద్రబాబుని కలవడానికి వెళ్లనున్నారు. ఒకేసారి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబుని కలవడానికి వెళుతూ ఉండడంతో రాజకీయాల్లోనే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలో కూడా వీరి భేటీ పై ఆసక్తి నెలకొంది. అలాగే ఈ మూలాకత్ లో దేనిపై మాట్లాడుకుంటారు అనేది కూడా చర్చగా మారింది. బాలకృష్ణ పార్టీని నడిపించాలా…? పవన్ ఏ విషయాలలో బాబుకి మద్దతు ఇవ్వాలి..? బాబుని ఎలా బయటికి తీసుకురావాలి…? బాబుపై వస్తున్న ఆరోపణలను ఎలా ఎదుర్కోవాలి. జనసేన టిడిపికి ఎలా మద్దతు ఇవ్వాలి అనే అంశంపై వీరి భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.