Prabhas : టాలీవుడ్ రేంజ్ ని పాన్ ఇండియా స్థాయికి తెలియజేసింది హీరో ప్రభాస్ నే అనడంలో ఎటువంటి సందేహం లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకుముందు కేవలం టాలీవుడ్ లోనే సినిమాలు చేసిన ప్రభాస్ ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. త్వరలోనే ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత రెండు సినిమాలు ప్లాప్ అవడంతో ప్రభాస్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇకపోతే తాజాగా ప్రభాస్ ఫ్యామిలీ గురించి నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ సోదరులు uv క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ బ్యానర్ లో ఎన్నో సినిమాలు చేశారు. వంశీ, ప్రమోద్, విక్రమ్ ఇలా అందరూ కలిసి ఈ బ్యానర్ ను వెనుక నుండి నడిపిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ సంస్థ ముక్కలైపోయిందని ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ కి సోదరుడు వరుసయ్యే ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి, రామ్ చరణ్ స్నేహితుడైన విక్రమ్ రెడ్డి కలిసి ఈ యూవీ క్రియేషన్స్ సంస్థను 2013లో స్థాపించారు. అప్పట్లో ఈ బ్యానర్ లో మిర్చి సినిమాను నిర్మించి అనేక సూపర్ హిట్లను అందుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమాలు అన్ని దారుణమైన డిజాస్టర్ లను అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే యూవీ క్రియేషన్స్ ముక్కలైపోయినట్లు ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే యూవీ కాన్సెప్ట్స్ పేరుతో ఒక కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించారు. అలాగే రామ్ చరణ్ తన స్నేహితుడు విక్రమ్ తో కలిసి విమెగా పిక్చర్స్ పేరుతో మరో సంస్థ ప్రారంభించాడు. ఇలా ఎవరికి వారు తమ దారి చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. మరో ఆసక్తికరమైన ప్రచారం మేరకు ఈ ముగ్గురు నిర్మాతల్లో ఒకరు దాసరి మారుతి, ఎస్కేయన్ కలిసి ప్రారంభించిన మాస్ మూవీ మేకర్స్ అనే నిర్మాణ సంస్థకు ఫైనాన్షియల్ సపోర్టుగా నిలబడుతున్నారని కూడా చెబుతున్నారు. ఈ సంస్థ నుంచి ముగ్గురు సంయుక్తంగా కలిసి చేస్తున్న చివరి సినిమాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంస్థ చేయాల్సిన స్పిరిట్ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకోగా రామ్ చరణ్ 16వ సినిమా విమెగా పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది.