Varun Tej : వరుణ్ తేజ్ 19 జనవరి 1990 సంవత్సరం లో నాగబాబు మరియు పద్మజ దంపతులకు జన్మించాడు. వరుణ్ తేజ్ హైద్రాబాద్ లో డిగ్రీ వరకు పూర్తి చేశాడు తర్వాత హీరో అవ్వాలి అనే ఆలోచనతో పై చదువులు చదవలేదు. అంతేకాకుండా వరుణ్ తేజ్ కి చదువు అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు, కానీ అప్పటికే నాగబాబు నిర్మాతగా పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయి ఉన్నాడు. ఒకానొక సమయంలో ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడట. ఆ సమయంలో వరుణ్ తేజ్ తీవ్ర నిరాశ కు లోనయ్యాడు. అప్పటివరకు ఆటపాటలతో సాగిన తన జీవితం డిగ్రీ అవ్వగానే ఇంటి ఆర్థిక పరిస్థితిని చూసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలని, తీవ్రంగా ఆలోచించే వాడు.
ఈ విషయాన్ని గమనించిన నాగబాబు తను తీవ్ర నిరాశకు గురైతే తన పిల్లలు కూడా అదే కోవకు వస్తున్నారని తన నిరాశ ను కనబడనివ్వకుండా తను ఒక మెట్టు దిగి సీరియల్స్ లో నైనా నటించాలని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో వరుణ్ తేజ్ ని హీరో చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే వరుణ్ తేజ్ ఆరు అడుగుల పైగా పొడవుతో హీరో లుక్ తో టాలీవుడ్ లో ఉన్న ప్రభాస్, రానా మాదిరిగా ఉన్నాడు. 2014 లో ముకుందా సినిమాతో హీరోగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు, వరుణ్ తేజ్ మొదటి సినిమా అంతగా హిట్ కాకపోయినా, వరుణ్ తేజ్ కి మంచి మార్కులే పడ్డాయి. మొదటి సినిమా అయినా ఎటువంటి బిడియం లేకుండా నటించాడని మంచి పేరు సంపాదించుకున్నాడు.
Varun Tej : కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్న వరుణ్ తేజ్

ఆ తర్వాత 2015 లో వచ్చిన కంచె సినిమా తో బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా చేసేటప్పుడు వరుణ్ తేజ్ తనని ఒక హీరోగా, స్పెషల్ గా చూడకండి, అందరితో సమానంగా చూడండి అని వినయంగా చెప్పాడు. ఈ సినిమా చేయడానికి ముందు ఎన్నో కసరత్తులు కూడా చేశాడు. ఈ సినిమాలోని వరుణ్ యాక్టింగ్ చూసిన క్రిష్ చాలా ఆశ్ఛర్యపోయాడంట, రెండవ సినిమాకే ఇంత మెచ్యూరిటీగా ఎలా యాక్ట్ చేసాడని, వరుణ్ తేజ్ కంచె సినిమాతో ఒక మెట్టు ఎక్కితే కథని ఎంచుకోవడంలో పది మెట్లు ఎక్కాడు అని సినీ పెద్దలు, అభిమానులు భావించారు. కంచె సినిమా షూటింగ్ జరుగుతుండగానే పూరీ జగన్నాథ్ లోఫర్ మూవీ ని చెప్పడం కంచె మూవీ గ్యాప్ లొనే లోఫర్ షూటింగ్ కూడా చేసేయడం గబగబా జరిగిపోయింది.
ఈ సినిమా కూడా నెల గ్యాప్ లోనే రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత 2017 లో దిల్ రాజు బ్యానర్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఫిదా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వరుణ్ తేజ్ మొదటి సినిమా ముకుందా కి 74.50 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. 2017 లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఫిదా సినిమాకి 5.80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
వరుణ్ తేజ్ గారి బ్లాక్ బస్టర్ సినిమాలు అంటే 2017 లో ఫిదా, 2018 లో అంతరిక్షం, 2019 లో గద్దల కొండా గణేష్, ఇంకా విక్టరీ వెంకటేష్ గారితో నటించిన ఎఫ్ 2, ఎఫ్ 3 ఇలా ఇంకా చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అంతేకాకుండా ఇప్పుడు వరుణ్ తేజ్ కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. సాహో సినిమా డైరెక్టర్ సుజీత్ ఒక కథను వరుణ్ కోసం సిద్ధం చేశాడు అంటా, సాహో సినిమా తర్వాత సుజిత్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇదే కావడంతో, సుజీత్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లోని సినిమా కావడంతో తన అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.