Computer Worm : కంప్యూటర్ వార్మ్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? సాధారణంగా వైరస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. కంప్యూటర్లలో, మొబైల్స్ లో వైరస్ ఉంటే ఆ వైరస్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. డేటా హ్యాక్ అవ్వొచ్చు.. సైబర్ క్రిమినల్స్ ఆయా సిస్టమ్స్ లోకి చొరబడి డేటాను దొంగలించే అవకాశం కూడా ఉంటుంది. వైరస్ నే మాల్వేర్, స్పైవేర్ అని కూడా అంటాం. మరి.. ఈ వార్మ్ అంటే ఏంటి? ఇదేం చేస్తుంది? సిస్టమ్ లోకి అసలు ఇది ఎలా ప్రవేశిస్తుంది.. అనే విషయాలు తెలుసుకుందాం రండి.
వైరస్ వేరు.. వార్మ్ వేరు. వైరస్ అనేది ఏదైనా లింక్ ను క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ ద్వారా సిస్టమ్స్ లోకి ప్రవేశిస్తుంది. లేదా.. ఏదైనా తెలియని అప్లికేషన్లను ఇన్ స్టాల్ చేసుకున్నా.. వాటి ద్వారా సిస్టమ్స్ లోకి వైరస్ చేరుతుంది. కానీ.. వార్మ్ అలా కాదు.. ఎలాంటి లింక్ క్లిక్ చేయకున్నా.. ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోకున్నా వ్యాప్తి చెందుతుంది.
Computer Worm : వార్మ్ సోకితే ఏం చేయాలి?
సాధారణంగా ఎవరికైనా మెయిల్ పంపించినా.. సోషల్ మీడియాలో మెసేజ్ లు పంపించినా.. ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసే సమయంలో.. ఇలా పలు రకాలుగా ఈ వార్మ్ ను సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేసిన సిస్టమ్స్ లోకి ఎంటర్ అయ్యేలా చేస్తారు. ఒక్కసారి అది సిస్టమ్ లోకి ప్రవేశించాక.. సిస్టమ్ లోకి డేటాను వెంటనే సైబర్ క్రిమినల్స్ కు చేరవేస్తుంది.
ఎక్కువగా ఇది నెట్ వర్క్ ద్వారా సిస్టమ్స్ లోకి వ్యాప్తి చెంది.. సిస్టమ్ సెక్యూరిటీని ముందు క్రాష్ చేస్తుంది. ఆ తర్వాత కంప్యూటర్ ను హ్యాకర్లకు కనెక్ట్ చేస్తుంది. దీంతో మన కంప్యూటర్, మొబైల్ లోని సెన్సిటివ్ డేటాను హ్యాకర్లు యాక్సెస్ చేసుకుంటారు.
అందుకే.. వైరస్ కన్నా కూడా ఈ వార్మ్ చాలా ప్రమాదకరం. కానీ… ఈ వార్మ్ అసలు సిస్టమ్ లోకి దేని ద్వారా ప్రవేశిస్తుందో తెలుసుకోవడం కష్టం. అందుకే.. ఎప్పటికప్పుడు యాంటీ వైరస్ లను అప్ డేట్ చేసుకొని ఎప్పటికప్పుడు కంప్యూటర్ ను స్కాన్ చేసుకుంటూ ఉంటే.. ఇలాంటి వార్మ్ సిస్టమ్ లోకి చొరబడకుండా అడ్డుకోవచ్చు.