Valtheru Veerayya : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వరస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సినిమా ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటూ వెళుతున్నారు. అందులో కే ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఒకటి. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు చిత్ర వర్గం ప్రకటించింది. అయితే తాజాగా ఇందులో మరో ముఖ్యమైన పాత్రలో ఓ సీనియర్ స్టార్ హీరో నటిస్తున్నట్లు సమాచారం. వరుస సినిమాలు చేస్తున్న చిరంజీవి ఇటీవల ఆచార్య మూవీ తో వచ్చారు. ఈ సినిమాను కొరటాల దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఇప్పుడు చిరంజీవి గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా చేయబోతున్నాడు. డైరెక్టర్ బాబి చిరంజీవితో సినిమా తీయబోతున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని ఎలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అని టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కబోతుంది అని డైరెక్టర్ బాబి ప్రకటించారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
Valtheru Veerayya : ముగ్గురు స్టార్ హీరోలతో సినిమా…

వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ నటించిన ఓ వీడియోను కొద్దిరోజుల క్రితమే చిత్ర యూనిట్ వదిలింది. ఆ వీడియోలో రవితేజ షూటింగ్లో పాల్గొన్నట్లు చూపించారు. అంతేకాదు అతనితో కలిసి చిరంజీవి ఓ సాంగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి, రవితేజ తో పాటు మరికొందరు స్టార్లు కీలకపాత్రలు పోషిస్తున్నారట. ఈ క్రమంలో ఈ సినిమాలో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వెంకటేష్ అతిథి పాత్రలో చేయబోతున్నాడట. ఈ పాత్ర ఐదు నిమిషాల లోపే ఉంటుందని తెలుస్తుంది.