Viral Video : పెళ్లికూతురు ఊర మాస్ డ్యాన్స్.. పెళ్లికొడుకు ముందే రెచ్చిపోయింది.. నెటిజన్లు ఫిదా

Viral Video : ఇది సోషల్ మీడియా యుగం. ఈ జనరేషన్ మొత్తం సోషల్ మీడియాలోనే బతుకుతోంది. సోషల్ మీడియాలోనే తమ టాలెంట్ ను చూపిస్తోంది. ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే పెళ్లిలో దించిన తల అస్సలు ఎత్తేవాళ్లు కాదు  పెళ్లికూతుళ్లు. కానీ… జనరేషన్ మారింది బాస్. ఇప్పుడు మాత్రం పెళ్లికూతుళ్లు అంటే తమ పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుంచి పెళ్లి, శోభనం వరకు ప్రతిదీ మెమోరీగా ఉండాలనుకుంటున్నారు.

banjara bride dance on her marriage video viral
banjara bride dance on her marriage video viral

అందుకే.. పెళ్లి ఫిక్స్ కాగానే ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, ఆ తర్వాత సంగీత్, హల్దీ ఫంక్షన్.. ఇలా పెళ్లి అయి మూడు ముళ్లు పడే వరకు ఉండే హడావుడే వేరు. ఆ తర్వాత పెళ్లి ఊరేగింపులో డ్యాన్సులు. ఇదివరకు పెళ్లి ఊరేగింపులలో పెళ్లికూతురు, పెళ్లి కొడుకు కారులో కూర్చొని డ్యాన్స్ చేసేవాళ్లను చూసేవారు. కానీ.. ఇప్పుడు పెళ్లికూతురు, పెళ్లికొడుకు కారు దిగి డ్యాన్స్ చూస్తుంటే అందరూ నిలబడి ఆశ్చర్యంగా చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది.

Viral Video : ఓ పెళ్లికూతురు డ్యాన్స్ వీడియో వైరల్

తాజాగా ఓ పెళ్లికూతురు వేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ పెళ్లికూతురు డ్యాన్స్ ను చూసి ఫిదా అవుతున్నారు. హీరోయిన్లు, డ్యాన్సర్లు డ్యాన్స్ వేస్తే చూసే కాలం నుంచి.. అందరూ డ్యాన్స్ వేసి అదరగొట్టే కాలానికి వచ్చేశాం. ఎందరో యువతీ యువకులు ఈ ట్రెండ్ ను ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఇటీవల బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా అనే పాటకు డ్యాన్స్ చేసిన పెళ్లికూతురు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే కదా. తాజాగా ఈ పెళ్లికూతురు వేసిన డ్యాన్స్ చూస్తే వావ్ అంటారు. ఆ పెళ్లికూతురు డ్యాన్స్ ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులు కూడా వామ్మో.. పెళ్లికూతురు ఎలా స్టెప్పులేసింది అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఆ పెళ్లికూతురు డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఆ వీడియో చూసి అవాక్కవుతున్నారు.