Vignesh Shivan : నయనతార విఘ్నేష్ శివన్ ల ప్రేమ గురించి ప్రేక్షకుల అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడూ అధికారికంగా ఇరువురు బయటకు చెప్పలేదు. వారిమధ్య ఉన్న ప్రేమ వారు పోస్ట్ చేసే ఫోటో వలన అందరికీ తెలిసింది. సోషల్ మీడియా లో వారు చేసే పోస్ట్ లు వారి సాన్నిహిత్యాన్ని తెలిపేవి. నానుం రౌడీ తాన్ సినిమాలో నాయన తార మరియు విఘ్నేష్ శివన్ కలిసి పని చేశారు. ఈ సినిమాలో హీరో గా విజయ్ సేతుపతి చేశాడు. విగ్నేష్ శివన్ డైరెక్టర్ గా చేశారు. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
అయితే వీరు ఇరువురు పెళ్లితో ఒకటి కాబోతున్నారు అని సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతూ వస్తుంది. ఈ వార్తలను నిజం చేస్తూ విఘ్నేష్ శివన్ ప్రెస్ మీట్ ద్వారా అధికారికంగా చెప్పటం జరిగింది. ఈ ప్రెస్ మీట్ విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ. నేను నా ప్రేయసి నాయన తార పెళ్లి ద్వారా ఒకటి ఒకటి కాబోతున్నాము అని దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి అని ప్రేక్షకులను ఉద్దేశించి చెప్పటం జరిగింది. ఇప్పటివరకు మా ప్రోఫిషన్ లైఫ్ లో అందరూ తోడుగా నిలిచారు. మా వ్యక్తిగత జీవితానికి మీ ఆశీర్వాదం కావాలి అని కోరుకున్నాడు.

విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి రైటర్ గా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి డైరెక్టర్ గా మారాను అని చెప్పాడు. అలానే ప్రొడ్యూసర్ గాను పనిచేశాను అన్ని సమయాలలో మీరు నాతో ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు నాతో ఉండాలి అని కోరుకున్నాడు. జూన్ 9న ఇద్దరు మహా బలిపురం లో నేను నయనతార వివాహం చేసుకుంటాం అని, ఈ పెళ్లికి బంధువులు స్నేహితులకు అటెండ్ అవుతున్నారని తెలియ జేశారు. ముందుగా తమ వివాహం తిరుమల లో అనుకున్నాం అని కొన్ని కారణాల వల్ల ఈ వివాహాన్ని మహాబలిపురం లో చేసుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ నెల జూన్ 9 న ఉదయం వీరు ఇరువురు వివహం ద్వారా ఒకటి కాబోతున్నట్లు ప్రకటించటం జరిగింది.