Lord venkateswara : కలియుగ దైవం అయినటువంటి ఏడుకొండల స్వామి కి హైందవ సంప్రదాయం స్థానం ఉంది. వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రతి శనివారం గుడికి వెళ్ళతు ఉంటారు.అయితే హిందూ సంప్రదాయం లో ప్రీతి ఒక్క రోజుకు ఒక్కో ప్రాధాన్యత ఉంది. అలాగే శనివారం వారం రోజుకు వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైన రోజుగా భావిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఏడుకొండల స్వామి వారిని భక్తులు అందరూ తమకు నచ్చిన విధంగా పూజిస్తూ ఉంటారు. అయన కృపకలిగితే సకల భదలు పోతాయి అని పూర్వజన్మలో కర్మల ప్రభావం ఈ జన్మలో తోలగిపోయి ఆనందం ఉంటాము అని భావిస్తారు.
శ్రీలక్ష్మి సమేతంగా ఉన్న శ్రీనివాసుడిని కొలిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని భక్తులు ఆయనను మనసారా కొలుస్తూ ఉంటారు.ఏడుకొండల స్వామిని శనివారం పూజించటానికి ప్రధాన కారణం, పూర్వజన్మల కర్మల వల్ల ఈ జన్మలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ కష్టాలను గట్టేకించడందనికి శనివారం ఆయనకు పూజ చేయటం వల్ల శని దేవుని అనుగ్రహం కలిగి బాధలనుండి విముక్తి కలుగుతుంది అని భక్తులు విశ్వసిస్తారు. వెక్నటేశ్వర స్వామి కృప మీ మీద ఉంటే ఎటువంటి కష్టాలు అయిన తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు అని నమ్మకం. శ్రీనివాసుడు కృప మీ మీద కలిగి శని ప్రభావం మీ మీద తగ్గి మీరు అష్టైశ్వర్యలు తో సుఖంగా ఉండాలి అంటే ఏడు శనివారాలు ఈ విధంగా చేయాలి.
ఏడు శనివారాలు ఈ విధంగా చేయాలి

మీ ఇంట్లోనే ఏడు శనివారాలు తెల్లవారు జామున లేచి తలస్నానం చేసి లక్ష్మి సమేత వెంకటేశ్వరస్వామి ని పూలతో అలంకరించి బియ్యం తో చేసిన పిండి, ఆవుపాలు, బెల్లం, అరటి పండు ను కలిపి దానితో ప్రమిదను చేసి దానిలో 7 వత్తులు వేసి నెయ్యి తో దీపం చేసి నిష్టగా పూజించటం ద్వారా సకల బాధలు తొలగి పోయి సంపదలు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు అని ఒక నమ్మకం. ఇలా చేయటం వలన లక్ష్మి దేవి మీ ఇంట్లో కొలువు ఉంటుంది అని ఒక నమ్మకం. శనివారం శ్రీనివాసుని గుడిలో సంధ్య వేళ లో ఆవునెయ్యి తో దీపం వెలిగించి పూజిస్తే సకల భాధలు తొలగి పోయి ఆనందం గా ఉంటారు అని పురాణాల చెపుతున్నాయి.