Vijay Devarakonda : పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి చేస్తున్న మూవీ లైగర్. ఈ మూవీ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో రెండు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా లైగర్ మూవీ షూటింగ్ ఫస్ట్ ఫోన్ అవుతూ ఉండడంతో ఇప్పటివరకు మూవీ రిలీజ్ అవ్వలేదు. పూరి జగన్నాథ్ తన సినిమాలు చాలా వేగంగా పూర్తి చేస్తాడని అనే పేరు ఆయనకు ఉంది. ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో విజయ్ దేవరకొండతో చేస్తున్న మూవీలతో పాటు మరో సోషియో ఫాంటసీ వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
వివరాల్లోకెళ్తే వరుస ప్లాపులతో కొంచెం వెనుకబడ్డ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మంచి లాభాలతో మళ్ళీ ట్రాక్ ఎక్కడం జరిగింది. అయితే అదే ఊపుతో విజయ్ దేవరకొండ తో లైగర్ మూవీ ప్రకటించాడు. కరోనా సమయంలో షూటింగ్ ఆవుకోవడంతో ఈ సినిమా చాలా ఆలస్యమైంది. లైగర్ మూవీ ఆగస్టు 25న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడానికి రంగం మొత్తం సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు కరణ్ జోహార్, చార్మికౌర్ ఇద్దరు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న జనగణమన మరో పాన్ ఇండియా మూవీ సెక్స్ పైకి తీసుకురావడంలో బిజీగా ఉన్నారు దర్శకనిర్మాతలు.
Vijay Devarakonda : ఈ సారి సోషియో ఫాంటసీ తో ప్లానింగ్.
ఇప్పటికే వీరిద్దరు కాంబినేషన్లో రెండు సినిమాలు నడుస్తుండడంతో మూడో సినిమాగా మరో సోషియో ఫాంటసీ మూవీ పూరి జగన్నాథ్ మరియు దేవరకొండ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూరి విజయ్ దేవరకొండ కి స్క్రిప్ట్ వినిపించారని దానికి విజయ్ ఓకే చెప్పారని ఈ సినిమా జనగణమన మూవీ పూర్తయిన తర్వాత పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద రానున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అంతేకాకుండా ఇది సోషియో ఫాంటసీ మూవీ అనడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.