Vijay Devarakonda : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా చూసి హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. రోసో బ్రదర్స్ సైతం ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ గురించి ప్రత్యేకంగా ముచ్చటించారు. అయితే కొంతమంది దక్షిణాది ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమా మీద సెటైర్లు వేశారు. కొంతమంది గే స్టోరీ అంటూ కామెంట్లు పెట్టారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాను మాత్రం అడ్డుకోలేకపోయారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది.
ఈ సినిమా ద్వారా తెలుగు పరిశ్రమ ఏంటో దాని సత్తా ఏంటో నిరూపించాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఎన్నో అంతర్జాతీయ పత్రికలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనను విశ్లేషిస్తూ, పొగుడుతూ ఫ్రంట్ పేజ్ ఆర్టికల్స్ రాస్తుండేవారు. ఇక వెరైటీ అనే ఇంటర్నేషనల్ మ్యాగజైన్ అయితే ఎన్టీఆర్ కు ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక ఆ వార్తలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు అదే విషయం మీద విజయ్ దేవరకొండ స్పందించాడు.
Vijay Devarakonda : తారక్ అన్న, చరణ్ అన్న లకు ఆస్కార్ అవార్డులు రావాలి…

తారక్ అన్నకు ఆస్కార్ రావాలి, ఆయన ఆస్కార్ అవార్డుని గెలవాలని కోరుకుంటున్నాను. మన దేశం నుంచి మన వాళ్లు గెలిస్తే ఉండే ఆనందం వేరే, అద్భుతంగా నటించేశారు..డెడ్లీ పర్ఫామెన్స్.. రామ్ చరణ్ అన్న, తారక్ అన్న కిల్లర్ పర్ఫామెన్స్ ఇచ్చారు అంటూ విజయ్ దేవరకొండ తన స్టైల్లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రౌడీ స్టార్ లైగర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పుడు బాయ్ కాట్ లైగర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అమీర్ ఖాన్ కు మద్దతు ఇచ్చినట్లుగా విజయ్ మాట్లాడడంతో ఇప్పుడు ఈ ట్రెండ్ వైరల్ అవుతుంది. అయితే దీని ప్రభావం రౌడీ హీరో మీద కానీ లైగర్ సినిమా మీద కానీ పడదనిపిస్తుంది. సినిమా బాగుంటే ఇలాంటి ట్రెండులు ఏమి చేయలేవని అభిమానులు అంటున్నారు.