Liger Trailer : ఒక లయన్ కు, టైగర్ కు పుట్టుంటాడు. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ.. అంటూ లైగర్ ట్రైలర్ స్టార్టింగే రమ్యకృష్ణ.. విజయ్ గురించి ఇంట్రడక్షన్ ఇస్తుంది. చాలా రోజుల నుంచి విజయ్ దేవరకొండ అభిమానులు.. ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా లైగర్ ట్రైలర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో వస్తున్నసినిమా ఇది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశావరు.
Liger Trailer : యాక్సన్ సీక్వెన్స్ అదుర్స్
ఇక.. ట్రైలర్ లో ఉండే యాక్సన్ సీక్వెన్స్ మాత్రం అదుర్స్ అనాలి. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ ట్రైలర్ లో కనిపిస్తాడు. విజయ్ స్టంట్స్ అయితే మామూలుగా లేవు. అనన్య రొమాన్స్ కూడా ట్రైలర్ లో అదిరిపోయింది. విజయ్ మాట్లాడటానికి మాత్రం ఎందుకో జంకినట్టుగా.. ఆయనకు నత్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో విజయ్ కు ఎక్కువగా డైలాగ్స్ లేనట్టు అనిపిస్తోంది.
ఏది ఏమైనా లైగర్ ట్రైలర్ మాత్రం ప్రామిసింగ్ గా ఉంది. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల కానుంది. హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. విజయ్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమా ఇది.