Rajamouli : రాజమౌళి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజమౌళి అనే పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. దానికి కారణం బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు. బాహుబలి సిరీస్ తో రాజమౌళి ప్రపంచానికి తెలిశాడు. ఆర్ఆర్ఆర్ తో తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు రాజమౌళి. ఇక.. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఏ సినిమా తీయబోతున్నాడు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొన్నది.

తన తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉంటుందని అంటున్నారు కానీ.. ఇంకా రాజమౌళి ఆ సినిమాపై ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు రాజమౌళికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Rajamouli : రాఘవేంద్రరావు కొడుకు సినిమా కూడా ఆగిపోయిందట
జూనియర్ ఎన్టీఆర్ తో రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తీశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా 2001 లో రిలీజ్ అయింది. రాజమౌళికి దర్శకుడిగా అదే తొలి సినిమా.
అయితే.. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా జక్కన్న ఒక సినిమా ప్లాన్ చేశాడు. దాన్ని ఒక మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించాలని అనుకున్నాడు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది.

ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు సూర్య ప్రకాశ్ తో భారీ సినిమాను రాజమౌళి ప్లాన్ చేశాడు. సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది కానీ.. బడ్జెట్ సర్దుబాటు కాక.. ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. అయితే.. సూర్య ప్రకాశ్ నటించిన తొలి మూవీ అట్టర్ ప్లాఫ్ అయింది. దీంతో రాజమౌళి సినిమా మధ్యలోనే ఆగిపోయింది అనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. ఏది ఏమైనా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తర్వాత రాజమౌళి రెండు సినిమాలు ఆగిపోయాయి.
ఆ తర్వాత 2003 లో మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తోనే జక్కన్న సింహాద్రి సినిమాను తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఆయన తీసిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. రికార్డులను బద్దలు కొట్టాయి.