Delhi Metro : ఓయోని తలపిస్తున్న ఢిల్లీ మెట్రో….అందరూ చూస్తుండగానే ఆ పని….

Delhi Metro  : ఈ మధ్యకాలంలో ఢిల్లీ మెట్రో అనేది లవర్స్ కి అడ్డగా మారింది. చుట్టూ ఎంతమంది ఉన్నా పట్టించుకోకుండా ఢిల్లీ మెట్రోలో చాలామంది అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తున్నారు. అయితే ఇదివరకే మెట్రోలో ఇలాంటి వీడియోలు మనం చాలానే చూసాం. దీంతో ఆగ్రహించిన మెట్రో యాజమాన్యం మెట్రోలో అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా కూడా ప్రేమ జంటలు అందరి ముందే రొమాన్స్ చేస్తున్నారు. వారి ప్రవర్తనతో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడతారనే కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అయితే తాజాగా ఢిల్లీ మెట్రో రైల్లో కామంతో రెచ్చిపోయిన ఓ ప్రేమ జంట వీడియో ఒకటి సోషల్ మీడియా వైరల్ గా మారింది.

Advertisement

viral-video-in-delhi-metro

Advertisement

ఇక ఈ వీడియోలో ఓ ప్రేమ జంట మెట్రో రైలులో అందరి ముందే ఉద్వేగభరితంగా ముద్దులు పెట్టుకోవడం , ఒకరినొకరు కౌగిలించుకోవడం చూడవచ్చు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో ఆ జంట మోఖాలు స్పష్టంగా కనిపించడం లేదు కానీ వారు చేస్తున్న పనులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కదులుతున్న మెట్రోలో కలుసుకున్న ఈ జంట అందరి ముందే ఇలా చేయడం చూసిన తోటి ప్రయాణికులలో ఒకరు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు అర్థమవుతుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నేటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ మెట్రోని ఓయోలా మార్చేసారంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే,

ఢిల్లీ మెట్రో భద్రత సిబ్బంది ఇంకా దీనిపై కఠిన చర్యలు తీసుకోలేదా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మెట్రో భద్రత సిబ్బంది సాధారణ దుస్తులలో తిరుగుతూ పెట్రోలింగ్ పటిష్టం చేస్తామని , అలాగే ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న సిబ్బందికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రయాణికులను ఇబ్బంది పెట్టే విధంగా ఏ ఒక్కరు చేయకూడదని హెచ్చరించడం జరిగింది. పబ్లిక్ గా అసభ్యకరమైన వాటిలో పాల్గొనకూడదని ఇది సెక్షన్ 59 ప్రకారం అసభ్యకరమైన నేరంగా పరిగణించారు.అయినా సరే ఢిల్లీ మెట్రోలో మరల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.

Advertisement